అసెంబ్లీ సమావేశాల రోజు 20న చంద్రబాబు భారీ వ్యూహం...

ఈనెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే రోజు అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.

news18-telugu
Updated: January 18, 2020, 10:21 PM IST
అసెంబ్లీ సమావేశాల రోజు 20న చంద్రబాబు భారీ వ్యూహం...
నారా చంద్రబాబునాయుడు
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈనెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే రోజు అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమరావతి జేఏసీ నిర్వహించిన ప్రజా చైతన్య సభలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 20న అమరావతి జేఏసీ నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్టు వెల్లడించారు. రాజధాని అంశం కేవలం అమరావతి రైతులకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశమని అన్నారు. రాజధానిని తరలిస్తోంది విశాఖ ప్రజలపై అభిమానంతో కాదని, అక్కడి భూములపై వైసీపీ కన్నుపడినందునే రాజధాని మార్పు జరుగుతోందని ఆరోపించారు. ఇవాళ అమరావతి ప్రజలను మోసం చేసినవాళ్లు రేపు విశాఖ ప్రజలను మోసం చేయరన్న నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేయిస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని, జగన్ కోసం పోలీసులు బలిపశువులుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని యువత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

అయితే, 20న అమరావతి జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీఆర్పీసీ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలలోని ప్రజలు కొత్త వారిని ఎవరిని తమతమ నివాస ప్రాంతాలలో ఉండుటకు అనుమతించరాదని, అట్టి వారిని అనుమతించడం వల్ల వారు ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, అట్టి వారికి ఆశ్రయం ఇచ్చిన వారి మీద కూడా చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి వచ్చే వారికి వాహనాలు, ఇతర లాజిస్టిక్స్ సమకూర్చిన వారిపైన కూడా తగిన చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading