Home /News /politics /

CHANDRABABU NAIDU CALLS 12 HOURS FAST AGAINST POLICE CHARGE SB

చంద్రబాబు హౌస్ అరెస్ట్.... 12 గంటలపాటు దీక్షకు పిలుపు

చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష (File)

చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష (File)

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. మరోవైపు నారా లోకేష్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల్ని, నేతల్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహార దీక్షను మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపి పిలుపు నిచ్చిన ఛలో అత్మకూరును పోలీసులు అడ్డుకోవడం పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలను టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

    ఆయన తనయడు, నారా లోకేష్‌ను కూడా పోలీసులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం బయట అడ్డుకున్నారు. దీంతో నారా లోకేష్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న నేతల్ని ఆరుబయటే అరెస్ట్ చేసి అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి అచ్చం నాయుడును చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు