పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు

పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్‌ను పోస్టు చేశారు. అంతేకాదు గతంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న ఆయన ఫోటోను కూడా షేర్ చేశారు

news18-telugu
Updated: September 2, 2019, 11:37 AM IST
పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ (File)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, సినీ సెలబ్రిటీలు, పోలిటికల్ లీడర్లు విషెస్‌ చెబుతున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ప్రశంసించారు.
విశిష్ట వ్యక్తిత్వంతో ఆయన ప్రజల పక్షాన నిలిచి సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు, ఆనందారోగ్యాలతో వర్థిల్లాలని కొరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్‌ను పోస్టు చేశారు. అంతేకాదు గతంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న ఆయన ఫోటోను కూడా షేర్ చేశారు. పవన్ పై చంద్రబాబు ఇలా ప్రశంసల వర్షం కురిపించడం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా అధికారపార్టీ నేతలు... వీరిద్దరి మధ్య మరోసారి స్నేహం కుదిరిందని జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు విమర్శలు చేసేందుకు కూడా అప్పుడే రెడీ అయిపోతున్నారు.


First published: September 2, 2019, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading