Chandrababu Naidu | విశాఖలో చంద్రబాబు ముందస్తు అరెస్ట్...

Chandrababu Naidu arrest | చంద్రబాబు, ఆయన అనుచరుల భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్ చేస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

news18-telugu
Updated: February 27, 2020, 4:29 PM IST
Chandrababu Naidu | విశాఖలో చంద్రబాబు ముందస్తు అరెస్ట్...
విశాఖ ఎయిర్‌పోర్టులో బైఠాయించిన చంద్రబాబు..
  • Share this:
Chandrababu Naidu Visakhapatnam | మాజీ సీఎం చంద్రబాబును ముందస్తుగా అరెస్ట్ చేస్తూ పోలీసులు నోటీసు ఇచ్చారు. విశాఖలో ముందుగా అనుమతి తీసుకున్నా కూడా తన పర్యటనకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలపాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు తనకు కారణం చెబితేనే కదులుతానని భీష్మించారు. దీంతో పోలీసులు నోటీసు ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీ భద్రత దృష్ట్యా మిమ్ములను, మీ అనుచరులను రక్షణ నిమిత్తం సీఆర్పీఎస్ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్ట్ చేస్తూ ఈ నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇందుకు మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం.’ అని విశాఖ నగర వెస్ట్ సబ్ డివిజన్ అసిస్టెండ్ కమిషనర్ పేరుతో పోలీసులు లేఖ ఇచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు తరలించారు. అక్కడి నుంచి విజయవాడ లేదా హైదరాబాద్ పంపించే అవకాశం ఉంది.

చంద్రబాబును ముందుస్తు అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసుల నోటీసు


విశాఖలో తన కాన్వాయ్ మీద కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారని, ఈ రోజు తనకు ఎదురైనే పరిస్థితే రేపు ప్రజలకు కూడా ఎదురవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ, విజయనగరంలో పర్యటనకు అనుమతి తీసుకున్నా ఇప్పుడు ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోండని, అయితే, ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ, విజయనగరం పర్యటనకు అనుమతి తీసుకున్నా. వైసీపీ వాళ్లు డబ్బులిచ్చి మనుషులను తెచ్చి దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఒకరిద్దరు రాళ్లు కూడా విసిరారు. పోలీసులు అరగంట తర్వాత పంపిస్తామన్నారు. ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్లమంటున్నారు. అరెస్ట్ చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బెదిరిస్తున్నారు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ, ఏ చట్టం ప్రకారమో ముందు నోటీసులు ఇవ్వండి’ అని చంద్రబాబు అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 27, 2020, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading