టీడీపీ నేతపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు

అప్పటివరకు కూల్‌గా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీ నేత పట్టాభిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: February 11, 2020, 1:05 PM IST
టీడీపీ నేతపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు
కొంతకాలం ఇదే అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరిగే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అమరావతి అంశంలో చంద్రబాబు వ్యూహానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు వ్యవహరించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
  • Share this:
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పార్టీలోని ఓ నాయకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నేడు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... వారికి పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత పట్టాభి ప్రస్తావన వచ్చింది. దీంతో అప్పటివరకు కూల్‌గా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టాభిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పట్టాభి మధ్య జరిగిన మాటల యుద్ధమే ఇందుకు అసలు కారణం. ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై కేశినేని నాని ట్వీట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన పట్టాభి... ఈ విషయంలో ఆయనతో తీవ్రంగా విభేదించారు.

కేశినేని వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని పట్టాభి వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు.
Published by: Kishore Akkaladevi
First published: February 11, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading