Home /News /politics /

మునిగిన బోటు తీయలేదు... పోలవరంపై మాట్లాడతారా... చంద్రబాబు విమర్శలు

మునిగిన బోటు తీయలేదు... పోలవరంపై మాట్లాడతారా... చంద్రబాబు విమర్శలు

చంద్రబాబు(ఫైల్ ఫోటో)

చంద్రబాబు(ఫైల్ ఫోటో)

దేశంలో ఏ భారీ ప్రాజెక్టులోనూ ఇప్పటివరకూ రివర్స్ టెండరింగ్ జరగలేదని చంద్రబాబు అన్నారు. పోలవరంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా ఇచ్చిందని వివరించారు.

    గోదావరి లో మునిగిన బోటు బయటికి తీయలేని వారు పొలవరం ప్రాజెక్టు లో టెక్నికల్ విషయాలు ఎలా మాట్లాడతారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌ వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలవరం గిన్నిస్ రికార్డు అందుకున్న ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. పోలవరంపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. పోలవరం లో సాగుతోంది రివర్స్ టెండరింగ్ కాదు, రీ టెండరింగ్ మాత్రమే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఈ ప్రక్రియకు తెరలేపిందని విమర్శించారు.

    దేశంలో ఏ భారీ ప్రాజెక్టులోనూ ఇప్పటివరకూ రివర్స్ టెండరింగ్ జరగలేదని చంద్రబాబు అన్నారు. పోలవరంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా ఇచ్చిందని వివరించారు. రివర్స్ టెండరింగ్ ఏ విధంగానూ మంచిది కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ సర్కారు కు చిత్తశుద్ధి ఉంటే రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్ళేది కాదని అన్నారు. పోలవరంలో టెక్నికల్ బిడ్ పూర్తి చేయకుండా ఫైనాన్షియల్ బిడ్‌కు వెళుతున్నారని... ఇదే వీళ్ళ రివర్స్ మాయ అని మండిపడ్డారు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా పోలవరం డిజైన్ చేశామని అన్నారు. సంక్లిష్టమైన ప్రాజెక్టు భవిష్యత్‌ను ఓ ఆర్అండ్ బీ ఇంజనీర్ చేతిలో ఎలా పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు.




    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Chandrababu naidu, Polavaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు