• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • CHANDRABABU NAIDU ANGRY ON CM YS JAGAN MOHAN REDDY OVER COVID 19 VACCINE ORDERS AK

Chandrababu Naidu: వాటికి రూ. 45 కోట్లు సరిపోతాయా ? జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు

చంద్రబాబునాయుడు (FIle)

Chandrababu Naidu: కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయని చంద్రబాబు అన్నారు.

  • Share this:
    రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా అని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నాంచారు. టీకా కోసం జగన్ సర్కార్ కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయని మండిపడ్డారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయని చంద్రబాబు అన్నారు. పలు రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్‌కు ఆర్డర్లు పెట్టని జగన్ సర్కార్.. కేంద్రానికి కేవలం లేఖలు రాయడం వల్ల వ్యాక్సిన్ సరఫరా చేస్తారా ? ప్రశ్నించారు. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని ఆయన గుర్తు చేశారు.

    తాను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. తాను టీకా తెప్పిస్తే సీఎం జగన్ సీఎంగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోతాయనని అన్నారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: