జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు... అక్కసుతోనే అలా...

మండలికి జగన్‌ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదించిందని, మండలిలో టీడీపీ చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

news18-telugu
Updated: January 27, 2020, 9:16 PM IST
జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు... అక్కసుతోనే అలా...
రాష్ట్రంలో దళితులపై, ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతోన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడక పోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అలుసు చూసుకునే నేరస్థులు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు.
  • Share this:
ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం చేయడం విచారకరమని, దీనిని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను పున:సమీక్షించాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3 రాజధానుల అంశాన్ని మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారనే అక్కసుతో మండలి రద్దుపై తీర్మానం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో...రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి లేదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉందని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓ నేరస్థుల ముఠా అని ఆయన విమర్శించారు. 86 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయని, నేరస్థుల ముఠాను మేధావులతో పోల్చుతున్నారని చంద్రబాబు విమర్శించారు. మండలికి జగన్‌ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదించిందని, మండలిలో టీడీపీ చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో డ్రామాలు ఆడి తీర్మానం చేశారని ఆయన ఆరోపించారు. మొదట సభలో సభ్యులను లెక్కించి 121మంది ఉన్నారని స్పీకర్ అన్నారని, తర్వాత 133మంది అన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మండలికి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుస్తున్నామన్న జగన్‌... కోర్టులకు వెళ్లేందుకు రూ.30కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.
Published by: Kishore Akkaladevi
First published: January 27, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading