నవరత్నాలు కాదు నవగ్రహాలు... జగన్‌పై చంద్రబాబు విమర్శలు

తాము అభివృద్ధి రాజకీయం చేస్తే... జగన్‌ద చిల్లర, రౌడీ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

news18-telugu
Updated: October 21, 2019, 3:34 PM IST
నవరత్నాలు కాదు నవగ్రహాలు... జగన్‌పై చంద్రబాబు విమర్శలు
జగన్, చంద్రబాబు
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన... వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మీ అబ్బ సొత్తు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మీ ముఖాలకు రంగులు పూసుకోండని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని... పల్నాటి పులి కోడెలను అక్రమ కేసులు పెట్టి వేధించి చంపారని చంద్రబాబు ఆరోపించారు.

తాము అభివృద్ధి రాజకీయం చేస్తే... జగన్‌ద చిల్లర, రౌడీ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను ఏ తప్పు చేయలేదని... ఎవరికీ భయపడబోనని ఆయన అన్నారు. పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని చంద్రబాబు అన్నారు. జగన్ సర్కార్ శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలని చంద్రబాబు అన్నారు. మైనింగ్ మాఫియాకు గనులు ఇచ్చిన వ్యక్తి జగన్‌కు సలహాదారుడుగా ఉన్నారని విమర్శించారు.

First published: October 21, 2019, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading