చంద్రబాబు ఇలా... కేసీఆర్ అలా... ఎవరి వ్యూహం వారిది

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: April 17, 2019, 12:52 PM IST
చంద్రబాబు ఇలా... కేసీఆర్ అలా... ఎవరి వ్యూహం వారిది
చంద్రబాబు నాయుడు, కేసీఆర్(File)
news18-telugu
Updated: April 17, 2019, 12:52 PM IST
రాజకీయ వ్యూహాల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ల తీరు భిన్నంగా ఉంటుంది. వీరిద్దరి వ్యూహాలు అంత తేలిగ్గా అర్థంకావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్... లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం అదే రకమైన ఆలోచనతో ఉన్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురుగాలి వీచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఆయన తన రూటు మార్చినట్టు తెలుస్తోంది. ఇందుకు ఈసీ వైఫల్యాలను ఆయన అవకాశంగా మార్చుకున్నారని సమాచారం.

ఎన్నికలు పూర్తయి... ఫలితాలు వచ్చేలోపే బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు... ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా... ఎన్నికల ఫలితాల తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్రమోదీని మళ్లీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్... అందులో ఉండే పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఎన్నికల తరువాత గెలిచే పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తరువాతే జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్న కేసీఆర్... అప్పటివరకు ఎదురుచూడటమే మేలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు, కేసీఆర్ విభిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...