Data Breach: బాహుబలి కంటే మహాకుట్ర.. ఢిల్లీలో స్కెచ్... సాక్ష్యాలివే అన్న చంద్రబాబు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ మహాకుట్రకు తెర తీశారని చంద్రబాబు ఆరోపించారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే ఐటీ గ్రిడ్ మీద దాడి చేసి టీడీపీ డేటాను దోపిడీ చేశారని మండిపడ్డారు.

news18-telugu
Updated: March 9, 2019, 3:03 PM IST
Data Breach: బాహుబలి కంటే మహాకుట్ర.. ఢిల్లీలో స్కెచ్... సాక్ష్యాలివే అన్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు
  • Share this:
డేటా చోరీ వివాదం వెనుక బాహుబలి సినిమాను మించిన కుట్ర ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇందులో దుష్టచతుష్టయం పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. 72 ఏళ్లలో కొన్ని ప్రభుత్వాలు అధికారాన్ని దుర్వినియోగం చేశాయి కానీ, ఎప్పుడూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. ఈ డేటా చోరీ కేసులో ఏ1 జగన్ మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి అయితే, ఏ3 పొరుగు రాష్ట్ర పాలకులు (తెలంగాణ) అని చంద్రబాబు ఆరోపించారు. ఈ డేటా కుట్రకు ఢిల్లీలో మొదటి స్కెచ్ చేశారన్నారు చంద్రబాబు. ఈ డేటా స్కాంకి పునాది ఫిబ్రవరి 19న ఢిల్లీలో పడిందన్నారు.

ఇవే సాక్ష్యాలు అంటూ చంద్రబాబు చెప్పిన వివరాలు...
ఫిబ్రవరి 19న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజల డేటాను టీడీపీ చట్టవిరుద్ధంగా చోరీ చేస్తోందని కంప్లెయింట్ ఇచ్చారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

22వ తేదీ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కుట్రలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి అయింది.



23వ తేదీ ఐటీ గ్రిడ్ సంస్థ మీద దాడులు చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే డైరెక్టుగా ఆ సంస్థలో తనిఖీలు చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఆ సంస్థలో టీడీపీకి సంబంధించిన సమాచారాన్ని పట్టపగలు దోపిడీ చేశారు. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కుటుంబాన్ని వేధించారు.

ఐటీ గ్రిడ్ మీద దాడులు చేసిన తర్వాత వారం రోజులకు మార్చి 2వ తేదీ అర్థరాత్రి 12.05 గంటలకు డేటా పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. అర్థరాత్రి డేటా పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తారా? ఏపీ డేటా పోయింది కాబట్టి మాకు సమాచారం ఇవ్వాలి కదా?

తెల్లకాగితాల మీద వీఆర్‌ఓల సంతకాలు ఎందుకు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు?
Loading...
మార్చి 4న సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 23వ తేదీన ఐటీ గ్రిడ్ మీద సోదాలు చేశామని చెప్పలేదు. మార్చి 7న సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర మాత్రం 23వ తేదీ ఐటీ గ్రిడ్‌లో తనిఖీలుచేశామని ఒప్పుకున్నారు. అసలు ఫిర్యాదు లేకుండా ఐటీ గ్రిడ్ మీద దాడి ఎందుకు చేశారు?

మార్చి 2,3,4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నారు. విజయసాయిరెడ్డి దర్శకత్వంలో, సీఎం ఆఫీసు సూచనలతో జరిగిన దాడి. మల్టీ విలన్ క్రిమనల్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, దగా, నిర్వీర్యం చేశారు. జగన్, విజయసాయిరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, మోదీ, అమిత్ షా అందరూ ఉన్నారు.

డేటా చోరీ మీరు చేసి మళ్లీ టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారా? అందరూ ఒకే పల్లవి పాడుతున్నారు. ముందస్తుగా కుట్ర చేసి, దాన్ని సర్దిచెప్పుకోవడానికి మళ్లీ తప్పు చేస్తున్నారు.

తెలంగాణలో పింఛన్లు ఇస్తే తప్పులేదు. వైసీపీ రూ.2వేలు ఇస్తానంటే తప్పులేదు. మేం ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజలకు మేలు చేస్తుంటే కడుపుమంటా?
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...