ఆ వీడియో చూసి చంద్రబాబు షాక్... అందులో ఏముందో తెలుసా ?

డైరెక్టుగా వీడియోలే చూపించాక పాపం ఇక సీఎం చంద్రబాబు మట్లాడటానికి ఏం లేకుండా పోయింది. దీంతో అక్కడ్నుంచి చంద్రబాబు ఏం మాట్లాడలేక సైలంట్‌గా బయటకు వచ్చేశారు.

news18-telugu
Updated: May 18, 2019, 9:29 AM IST
ఆ వీడియో చూసి చంద్రబాబు షాక్... అందులో ఏముందో తెలుసా ?
చంద్రబాబు (ఫైల్)
  • Share this:
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు, సమావేశాల హడావుడి అంతా ఇంత కాదు. ఇక ఎన్నికల కమిషన్‌పై ఆయన కారాలు, మిరియాలు నూరుతూ వస్తున్నారు. వీలు దొరికినప్పుడు ఢిల్లీకి వెళ్లి మరి ప్రెస్ మీట్‌లు పెట్టి మరి ఈసీపై విమర్శలు చేస్తున్నారు. వీపీ ప్యాట్లు లెక్కించాలంటూ కూడా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టి ఎన్నికల సంఘంపై యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. అయితే తాజాగా ఏపీలో రీపోలింగ్ అంశం తెరపైకి రావడంతో ... చంద్రబాబు అదే బాటలో పయనిస్తున్నారుజ చంద్రగిరి రిపోలింగ్ అంశంపైనా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రీ పోలింగ్ నిర్ణయం తెలియగానే హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఈసీని కలిశారు. ఇదెక్కడి చోద్యమంటూ ఈసీని నిలదీశారు. దీంతో ఈసీ అధికారులు చంద్రబాబుకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. చంద్రబాబు ఎంత ఆవేశంగా మాట్లాడిన ఈసీ అధికారులు మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెప్పారట. ఎక్కువ మాట్లాడకుండానే ఆయనకు ఓ వీడియో చూపించారట. ఇదిగో మీ పార్టీ వాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీరే చూసుకోండి..అంటూ వీడియో ఫుటేజ్‌ను ఆయన ముందు పెట్టారట. చంద్రగిరిలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన వీడియోను ఆయనకు చూపించారట.

ఇంకేముంది ఈ ఆ వీడియోల్లో బుత్ క్యాప్చరింగ్ చేసి ఓట్లు రిగ్గింగ్ చేయడం క్లియర్‌‌గా రికార్డయ్యింది. దీంతో మరీ ఇంత ఘోరంగా ఉన్నా కూడా రీ పోలింగ్ పెట్టకూడదా అని ఈసీ అధికారులు చంద్రబాబును ఎదురు ప్రశ్నించారట. డైరెక్టుగా వీడియోలే చూపించాక పాపం ఇక సీఎం చంద్రబాబు మట్లాడటానికి ఏం లేకుండా పోయింది. దీంతో అక్కడ్నుంచి చంద్రబాబు ఏం మాట్లాడలేక సైలంట్‌గా బయటకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత షరా మామూలుగా ఈసీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. యథావిధిగా ఎన్నికల సంఘం వివక్ష మీద నిప్పులు చెరిగేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

First published: May 18, 2019, 9:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading