అమరావతిపై సమావేశం... చంద్రబాబుకు స్పష్టత వచ్చినట్టేనా...

కొంతకాలంగా టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని... త్వరలోనే వారంతా చంద్రబాబుకు గుడ్ బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 6, 2019, 12:04 PM IST
అమరావతిపై సమావేశం... చంద్రబాబుకు స్పష్టత వచ్చినట్టేనా...
చంద్రబాబు నాయుడు (ఫైల్)
  • Share this:
అమరావతిపై ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని... ఏపీ నూతన రాజధానిని అంతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ మినహా ఇతర పార్టీలను ఆహ్వానించారు. సమావేశంలో పాల్గొని వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదంతా ఎలా ఉన్నా... ఈ సమావేశం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ విషయంలో క్లారిటీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని... త్వరలోనే వారంతా చంద్రబాబుకు గుడ్ బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశం చంద్రబాబుకు ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావేశంలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారనే దానిపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కచ్చితంగా పార్టీలో కొనసాగే అవకాశం ఉందని... మీటింగ్‌కు దూరంగా ఉన్న వాళ్లు పార్టీలో కొనసాగుతారో లేదో చెప్పలేమని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా టీడీపీ సమావేశాలకు పెద్దగా హాజరుకాని చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ సైతం ఈ భేటీకి రావడం మరో విశేషం.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>