మండలిలో రోజా సెల్ఫీలు.. చంద్రబాబు చేతికి కొత్త ఆయుధం..

గ్యాలరీలోకి వెళ్తుంటే అక్కడి సిబ్బంది తన మొబైల్ అడిగి తీసుకున్నారని.. కానీ వైసీపీ సభ్యులు మాత్రం సెల్‌ఫోన్‌లతో సెల్ఫీలు తీసుకున్నా ఎవరూ అడ్డుచెప్పలేదని తెలిపారు. వారు సెల్‌ఫోన్‌లతో లోపలికి ఎలా వచ్చారు? ఫొటోలు ఎలా దిగారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.


Updated: January 24, 2020, 4:55 PM IST
మండలిలో రోజా సెల్ఫీలు.. చంద్రబాబు చేతికి కొత్త ఆయుధం..
మండలిలో రోజా సెల్ఫీలు.. చంద్రబాబు చేతికి కొత్త ఆయుధం..
  • Share this:
బుధారం శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను చంద్రబాబు ప్రభావితం చేసి చట్టసభలకు మచ్చతెచ్చాని వైసీపీ మండిపడుతోంది. నిండు సభలో మంత్రులు గూండాల్లో ప్రవర్తించారని, ఛైర్మన్‌పై దాడికి యత్నించారని టీడీపీ ధ్వజమెత్తుతోంది. ఈ క్రమంలో ఆ రోజు మండలిలో నెలకొన్న పరిణామాలను మీడియాకు వివరించారు చంద్రబాబు.

సభలో ఏం జరుగుతుందో బయటకు తెలియనీకుండా లైవ్ కట్ చేశారని ఆయన విమర్శించారు. అందుకే తాను మండలి గ్యాలరీలోకి వెళ్లానని చెప్పారు చంద్రబాబు. గ్యాలరీలోకి వెళ్తుంటే అక్కడి సిబ్బంది తన మొబైల్ అడిగి తీసుకున్నారని.. కానీ వైసీపీ సభ్యులు మాత్రం సెల్‌ఫోన్‌లతో సెల్ఫీలు తీసుకున్నా ఎవరూ అడ్డుచెప్పలేదని తెలిపారు. వారు సెల్‌ఫోన్‌లతో లోపలికి ఎలా వచ్చారు? ఫొటోలు ఎలా దిగారు? అని ఆయన ప్రశ్నించారు. పరోక్షంగా బాలకృష్ణతో రోజా, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్న సెల్ఫీలను చంద్రబాబు తప్పుబట్టారు.

''కౌన్సిల్‌లో 22 మంది మంత్రులు ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారు. సభలో లైవ్ ప్రసారాలు, టీవీలు కట్ చేశారు. కౌన్సిల్ గ్యాలేరీలో కూర్చుంటే నన్ను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కౌన్సిల్ చైర్మన్‌ను బూతులు తిట్టారు. ఆయన రూంలో కొట్టేందుకు ప్రయత్నించారు. మంత్రులు.. గూండాలు,బజారు రౌడీలుగా వ్యవహరించారు. రౌడీల్లా ప్రవర్తిస్తే మేము సరెండర్ అయిపోవాలా. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుంది. మీరు చెప్పినట్లు వినకుంటే మండలి రద్దు చేస్తారా?'' అని చంద్రబాబు మండిపడ్డారు.First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు