Tirupati Loksabha by-poll: తిరుపతి ఉప ఎన్నిక.. టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు..

చంద్రబాబు నాయుడు(ఫైల్ పొటో)

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో.. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.

  • Share this:
    తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో.. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ తరఫున బరిలో నిలపనున్నట్టు సోమవారం పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు.. ఉప ఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యుహంపై ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మి గెలుపు కోసం అందరు కలిసి పనిచేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.

    పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచి రెండు సార్లు, బాపట్ల నుంచి ఒక సారి ఆమె 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి గా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ,జౌళి తదితర మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    ఇక, తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కంటే ముందే తమ కసరత్తులను ప్రారంభించాయి. ఇప్పటికే తిరుపతిలో తాము గెలిచి తీరుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

    Chandrababu Naidu, Tirupati Loksabha by poll, panabaka Lakshmi as TDP mp candidate,  panabaka Lakshmi, panabaka Lakshmi Tdp Candidate, Tirupati LS By Poll panabaka Lakshmi Tdp Candidate, చంద్రబాబు నాయుడు, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, పనబాక లక్ష్మి, టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి,
    పనబాక లక్ష్మి


    ఇక, సిట్టింగ్ ఎంపీ వైసీపీ చెందిన వ్యక్తి కావడంతో.. ఆ పార్టీ ఉప ఎన్నికలో అదే కుటుంబానికి టికెట్ కేటాయిస్తుందా, లేదా వేరే అభ్యర్థిని బరిలో దించుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published: