ప్రకృతి విపత్తు కాదు.. ప్రభుత్వ విపత్తు... కృష్ణా వరదలపై చంద్రబాబు

కృష్ణా వరదలపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు... వరదను నియంత్రించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 23, 2019, 1:50 PM IST
ప్రకృతి విపత్తు కాదు.. ప్రభుత్వ విపత్తు... కృష్ణా వరదలపై చంద్రబాబు
చంద్రబాబు (File)
news18-telugu
Updated: August 23, 2019, 1:50 PM IST
వరదల సాకుతో రాజధానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా వరదలపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు... వరదను నియంత్రించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తన ఇంటిని ముంచేందుకు ప్రకాశం బ్యారేజీలో 4 టీఎంసీలు నిల్వ చేశారన్న చంద్రబాబు... ఈ కారణంగా లంక గ్రామాల్లో 50 వేల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయని ఆరోపించారు. రాయలసీమలోని అనేక రిజర్వాయర్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని... వరదల సమయంలో వాటిని నింపుకునే ప్రయత్నం చేయకుండా వరద నీటిని కిందకు విడుదల చేశారని చంద్రబాబు వివరించారు. కృష్ణాకు వరదలకు కొత్తకాదని చంద్రబాబు అన్నారు.

ఇది ప్రకృతి విపత్తు కాదని... ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని చంద్రబాబు అన్నారు. రాజధానిని ముంచాలనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన లేదని ఆరోపించారు. రాజధాని మరో చోటకు తరలించేందుకు ఈ రకంగా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వరదల కారణంగా వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. వరద బాధితులు భోజనం అడిగితే కొందరు ఆధార్ అడిగారని అన్నారు. వరదలపై సీఎం జగన్ ఒక్క సమీక్ష కూడా చేయలేదని చంద్రబాబు విమర్శించారు. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి నోటీసులు అంటించారన్న చంద్రబాబు... ఏపీలో తన ఇంటికి తప్ప మరెవరికి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. కృష్ణా వరదలపై కర్ణాటక, మహారాష్ట్ర సీఎం మాట్లాడుకుని వరదలను నియంత్రించే ప్రయత్నం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...