మర్యాదగా ఉండదు... స్పీకర్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు

దీంతో స్పీకర్ చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానంపై మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు తమ్మినేని.

news18-telugu
Updated: December 11, 2019, 10:45 AM IST
మర్యాదగా ఉండదు... స్పీకర్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
తమ్మినేని సీితారాం
  • Share this:
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై మాట్లాడుతున్న చంద్రబాబును స్పీకర్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మేం మాట్లాడితే అడ్డుకుంటున్నారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్‌‌కు మర్యాదగా ఉండదంటూ బాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానంపై మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చంద్రబాబు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాలన్నారు స్పీకర్ తమ్మినేని. దీంతో వైసీపీ సభ్యులు మాట్లాడుతూ చంద్రబబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రాబును సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారంటూ మండిపడ్డారు.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>