రాష్ట్రంలో జే టాక్స్... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలు టార్గెట్లు పెట్టుకుని మరీ దోపిడీలు చేస్తున్నారని... ఇసుక, సిమెంటు,మద్యం సహా అన్నింటిలోనూ దోపిడీ సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు.

news18-telugu
Updated: November 13, 2019, 2:40 PM IST
రాష్ట్రంలో జే టాక్స్... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జగన్, చంద్రబాబు
  • Share this:
రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలన్నా... ఆస్తులు అమ్మాలంటే జే టాక్స్ కట్టాలని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు విజయవాడలో చేపట్టబోయే ఇసుక దీక్షపై కృష్ణా, గుంటూరు జిల్లా మండల స్థాయి పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. విజయవాడలో రేపటి 12గంటల నిరసన దీక్ష సక్సెస్ చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు జిల్లాల నుంచి భారీగా తరలిరావాలని ఆదేశించారు. ఇసుక కృత్రిమ కొరతను వైసిపి నేతలే సృష్టించారని... ఇసుక మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఈ కష్టం, ఇంత నష్టం గతంలో లేదని... 5నెలల్లో 50మంది కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఎప్పుడూ లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు టార్గెట్లు పెట్టుకుని మరీ దోపిడీలు చేస్తున్నారని... ఇసుక, సిమెంటు,మద్యం సహా అన్నింటిలోనూ దోపిడీ సాగుతోందని అన్నారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ నిలిపేశారని... ఏపి అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఎక్కడా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టమన్న చంద్రబాబు... రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేస్తున్నారని ఆరోపించారు. 12 గంటల నిరసన దీక్షలో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు