ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. అది డీజీపీ ఆఫీసులా లేదని, వైసీపీ కార్యాలయంలా ఉందని మండిపడ్డారు. విజయవాడలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దని డీజీపీ ఎలా చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్య గురించి మాట్లాడిన తనకు కూడా నోటీసులు పంపుతామని డీజీపీ అంటున్నారని.. నోటీసులు పంపండి చూద్దాం అని సవాల్ విసిరారు. ‘వివేకా హత్య కేసులో ఎస్పీ, సిట్లను ఎందుకు మార్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే డీజీపీ ఎందుకు కలవలేదు. డీజీపీ ఎందుకు అంతగా సహనం కోల్పోతున్నారు. డీజీపీ నాకు నోటీసులు పంపుతామని అన్నారు. పంపండి చూద్దాం.’అని చంద్రబాబు అన్నారు.
మీడియాపై ఆంక్షల విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా మించిపోయారని చంద్రబాబు అన్నారు. జగన్ రాజకీయానికి ఈ ఆంక్షలే మరణశాసనం అవుతాయని మండిపడ్డారు. వైఎస్ కూడా గతంలో ఇలాంటి ఆంక్షలు విధించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గారని చెప్పారు. జగన్ కంటే వైఎస్ వెయ్యి రెట్లు బెటర్ అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దారుణంగా మాట్లాడితే రాష్ట్రంలో అడిగే దిక్కే లేకుండాపోయిందని చంద్రబాబు అన్నారు. ఆమంచి కుటుంబసభ్యులు పోలీసులను అన్న మాటలు డీజీపీకి వినిపించలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.