చంద్రబాబును సీఎం చేసింది బీజేపీనే.. సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సీఎం పీఠం ఎక్కించింది బీజేపీయేనని ఆ పార్టీ సీనియన్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతం లేదని, విశ్వసనీయత అసలే లేదని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: October 19, 2019, 3:58 PM IST
చంద్రబాబును సీఎం చేసింది బీజేపీనే.. సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
చంద్రబాబు (File)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సీఎం పీఠం ఎక్కించింది బీజేపీయేనని ఆ పార్టీ సీనియన్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతం లేదని, విశ్వసనీయత అసలే లేదని వ్యాఖ్యానించారు. తన ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల వల్ల బీజేపీ బలపడటం లేదని, ఓడిపోయిన పార్టీ నుంచి 10 మంది నేతలు వచ్చినంత మాత్రానా తమ పార్టీ బలపడదని అన్నారు. వాస్తవానికి వారి రాజకీయ భవిష్యత్తు కోసమే కాషాయ కండువా కప్పుకుంటున్నారని చెప్పారు. కులాలు, మతాలతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూశారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు, ఆయన దగ్గర ఏముందని కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.

Nobody will meet Chandrababu Naidu after Election Results on May 23rd
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)


కావాలనుకుంటే.. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే తాను తమ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతా నని చెప్పారు. పోలవరంలో రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించిందని, అందుకే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని ప్రస్తుత వైసీపీ సర్కారు చెబుతోందన్నారు. పోలవరం ,అమరావతిలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. బాబును తాము భయపెట్టడం లేదని, అవినీతికి పాల్పడ్డవారిని వదిలిపెట్టబోమన్న మోదీ మాటలకు చంద్రబాబు భుజాలు తడుముకుంటే ఏం చేస్తామని తెలిపారు.

గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులపై చంద్రబాబును లెక్కలు అడిగామని, కానీ ఆయన చెప్పలేదని.. మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారో? అర్థం కావడం లేదని జీవీఎల్ అన్నారు. రుణాల ఎగవేత విషయంలో ఎవరూ తప్పించుకోలేరని, దీనికి తమ పార్టీ నేత సుజనా చౌదరి కూడా అతీతుడు కాదని చెప్పారు. అందరిలాగే సుజానా కూడా బ్యాంకులకు రుణాలు కట్టాల్సిందేనన్నారు. బీజేపీ లో చేరినంత మాత్రాన సుజానాకు మినహాయింపులుండవని స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 19, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading