Jr NTR మనసు మార్చే ప్రయత్నం? -చర్చలకు వెళ్లింది ఎవరో తెలుసా? -చంద్రబాబు మంతనాలపై లోకేశ్ అలక!

జూ.ఎన్టీఆర్, చంద్రబాబు

జగన్ ను ఢీకొట్టాలంటే జూనియర్ ను తేవాల్సిందేనన్న డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తున్నది. లోకేశ్ భవిష్యత్తు దృష్ట్యా సదరు డిమాండ్లను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. పార్టీ పుట్టి మునిగే పరిస్థితిలో జూనియర్ కోసం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక వర్గానికి చెందిన ప్రముఖులను జూనియర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది..

  • Share this:
‘Jr NTR రావాల్సిందే.. TDPకి నాయకత్వం వహించాల్సిందే.. వి వాంట్ జూనియర్ ఎన్టీఆర్..’ అంటూ తెలుగు తమ్ముళ్లు హడావుడి చేయడం పార్టీలో పరిపాటిగా మారింది. సందర్భాలు వేరైనా, వేదికలు మారినా కనీసం ఒక్కసారైనా జూనియర్ పేరు ఎత్తనిదే తెలుగుదేశం పార్టీ (TDP)  సభలు ముందుకు సాగడంలేదు. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచీ పార్టీలో కొనసాగుతోన్న పెద్దలు సైతం తారక్ రావాల్సిందేనని పట్టుపడుతుండటం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటోళ్లైతే ఏకంగా రాజీనామాకు సిద్ధపడటంతో జూనియర్ ఎన్టీఆర్ సేవలను ‘వాడుకునే’ విషయమై అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజాగా మంతనాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే జూనియర్ కోసం తండ్రి చేస్తోన్న ప్రయత్నాలు నారా లోకేశ్ కు రుచించడంలేదట. బాబుకు ఆప్తులుగా పేరుపొందిన పారిశ్రామిక, సినీ దిగ్గజాలు కొందరు ఎన్టీఆర్ తో చర్చలు జరిపినట్లు తెలిశాక లోకేశ్ అలక వహించినట్లు వార్తలు వస్తున్నాయి..

తారక్ మనసు మార్చేలా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా, అధికార వైసీపీపై, సీఎం జగన్ పై టీడీపీ అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నది. అంశాలవారీగా దాదాపు యుద్ధాలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం ఆదరణ లేకపోవడం టీడీపీ శ్రేణుల్ని కలవరపెడుతున్నది. రెండున్నరేళ్ల తర్వాత కూడా ఏ ఎన్నికలోనూ టీడీపీ నెగ్గలేని దుస్థితిలో నాయకత్వ మార్పుపై నేతలు స్వరం పెంచుతున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను ప్రమోట్ చేయడం మానేసి, సమర్థుడైన జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావడం ద్వారా పార్టీకి పునర్వైభవం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. చాలా కాలంపాటు ఈ డిమండ్ ను పట్టించుకోని బాబు.. తాజాగా సదరు అంశంపై దృష్టిసారించినట్లు సమాచారం. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న జూనియర్ మనసును మార్చేందుకు చంద్రబాబు మంతనాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..

ఉపరాష్ట్రపతిగా KCR అసలు కథ ఇదే -ఓడిపోతే దుప్పటి కప్పుకోవాలా? Huzurabad చాలా చిన్న ఎన్నిక: మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు


ఒక వర్గానికి చెందినవాళ్లతో రాయబారం..
ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కుల రాజకీయాలు నడిపిన లేదా సమర్థించినట్లు ఎక్కడా బయటికి రాలేదు. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత ఒక వర్గంవారు టార్గెట్ అయ్యారనే భావన, జగన్ పై పోరులో ఆ వర్గంవారు ఐక్యమవుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సదరు వర్గానికే చెందిన 8మంది కీలక వ్యక్తులు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని తెలుస్తోంది. సినీ, పారిశ్రామ వర్గాలకు చెందిన ఆ 8 మంది వేర్వేరుగా ఎన్టీఆర్ తో గంటలపాటు సమావేశాలు నిర్వహించారని, ఆ భేటీల్లో ప్రధానంగా ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ అవసరతపైనే చర్చ జరిగిందని సమాచారం. ఈ మేరకు పలు పాపులర్ వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది మాత్రం బయటికి ఇంకా వెల్లడికాలేదు..

అందుకే నాపై దాడి చేశారు -షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సుఖీభవ ఫేమ్ శరత్ రెడ్డి -అయ్యయ్యో వద్దన్నా..


జూనియర్ తోనే జగన్ కు చెక్
రాజకీయాలకు దూరంగా ఉంటోన్న జూనియర్ ఎన్టీఆర్ మనసు మార్చేలా చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాల్లో భాగంగానే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అతనితో భేటీ అయ్యారనే చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కల్యాణ్ తిరిగి టీడీపీకి దగ్గరవుతున్నా.. జగన్ ను ఢీకొట్టడానికి ఆ బలం సరిపోదని, జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే వైసీపీకి చెక్ పెట్టొచ్చనే వాదనకు చంద్రబాబు కూడా తలొగ్గినట్లు తెలుస్తోంది. వర్గం నేతలతో రాయబారాల తర్వాత ఒక దశలో చంద్రబాబు నేరుగా ఎన్టీఆర్ తో ఫోన్ లోనూ మాట్లాడినట్లు సమాచారం. తాజా రాయబారాలపై జూనియర్ పాజిటివ్ గా స్పందించారని, కొన్ని కండిషన్లతో ప్రతిపాదనలకు అంగీకారం కూడా తెలిపారని కథనాలు వచ్చాయి. ఎన్టీఆర్ ను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారని, తండ్రిపై అలకబూనారని సమాచారం. అయితే ఈ విషయాల్లో వాస్తవికత ఎంత? అన్నది తేలాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published: