జగన్ వల్లే ఉల్లి ధరలు పెరిగాయ్.. చంద్రబాబు ఆగ్రహం

రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ధ్వజమెత్తారు మాజీ సీఎం. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: December 4, 2019, 10:01 PM IST
జగన్ వల్లే ఉల్లి ధరలు పెరిగాయ్.. చంద్రబాబు ఆగ్రహం
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, విచ్చలవిడిగా దోచుకోవడం తప్ప ఏమీ సాధించలేదని మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీకి వచ్చే ఆదాయం 30శాతం మేరకు పడిపోయిందని .. భవిష్యత్‌లో అప్పులు పుట్టే పరిస్థితి కూడా ఉండదని విరుచుకుపడ్డారు చంద్రబాబు. సీఎం జగన్ చేతగానితనం వల్లే ఉల్లి ధర రూ.110కి చేరిందని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ధ్వజమెత్తారు మాజీ సీఎం. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.


కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు భౌతిక దాడులు చేయడమే గాక మాసికంగా ప్రతి ఒక్కరినీ కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన ఓ ఎస్సీ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారని. అది తట్టుకోలేక అతని తండ్రి గుండె ఆగి చనిపోయాడని అన్నారు. ఇవాళ ఆఫీసుకు వెళ్తే దాడి చేశారన్న చంద్రబాబు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి ఉందని వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>