బావతో సరదాగా ఛాలెంజ్ చేశా.. ఆ విషయంలో మెదక్ తర్వాతే : కేటీఆర్

ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈసీ ఎన్నికల అధికారులను మారిస్తే చంద్రబాబు ఎందుకంతలా భయపడిపోతున్నారని ప్రశ్నించారు. మాట్లాడితే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఇంత చిల్లర అరుపులతో గగ్గోలు పెట్టమేంటని మండిపడ్డారు.

news18-telugu
Updated: April 14, 2019, 2:19 PM IST
బావతో సరదాగా ఛాలెంజ్ చేశా.. ఆ విషయంలో మెదక్ తర్వాతే : కేటీఆర్
కేటీఆర్, హరీశ్ రావు(File)
  • Share this:
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కారుకు 'పదహారు' స్థానాలు ఖాయమంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక మెజారిటీలో కరీంనగర్ ఈసారి మెదక్‌ను మించిపోతుందన్న వ్యాఖ్యలు సరదాగా చేసినవే అని చెప్పారు. ప్రజలను ఉత్తేజపరచడానికి బావ హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ చేసినట్టు తెలిపారు. మెజారిటీలో మెదక్ టాప్‌లో నిలుస్తుందని.. వరంగల్, కరీంనగర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తాయని చెప్పారు. సీఎం ఇలాక అయిన మెదక్‌లో టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈసీ ఎన్నికల అధికారులను మారిస్తే చంద్రబాబు ఎందుకంతలా భయపడిపోతున్నారని ప్రశ్నించారు. మాట్లాడితే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఇంత చిల్లర అరుపులతో గగ్గోలు పెట్టడమేంటని మండిపడ్డారు. టెక్నాలజీకి తానే కేరాఫ్ అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి.. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ ఆరోపించడం విచారకరం అన్నారు.

గెలిస్తే టెక్నాలజీ భేష్ అని, లేకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అని చంద్రబాబు ఆరోపించడం సరికాదన్నారు. చంద్రబాబు పట్ల విశ్వసనీయత ఉంటే ప్రజలు మళ్లీ ఆయన్నే ఆదరిస్తారని.. దానికి ఇంత గగ్గోలు పెట్టాల్సిన పనిలేదన్నారు. రోడ్ షోలలో వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని అందరికీ అర్థమైందన్నారు. చంద్రబాబు కేసీఆర్, జగన్‌లను మోదీ పెంపుడు కుక్కలు అని విమర్శించారని.. తమకు సంస్కారం ఉంది కాబట్టే అలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావడం, రెవెన్యూ శాఖలను ప్రక్షాళన చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

First published: April 14, 2019, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading