రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా..? చర్యలకు సిద్దమైన కాంగ్రెస్..

యురేనియం తవ్వకాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్ చేసిన వ్యాఖ్యలను కోదండరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించామని తెలిపారు.

news18-telugu
Updated: September 21, 2019, 11:08 AM IST
రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా..? చర్యలకు సిద్దమైన కాంగ్రెస్..
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి కథ అడ్డం తిరిగింది. పార్టీకి తానే భవిష్యత్ నాయకుడిని అని కలలు కంటున్నవేళ.. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.టీపీసీసీ చీఫ్‌ పదవి దక్కకుండా అడ్డుపడ్డారన్న అసంతృప్తో మరొకటో గానీ సొంత పార్టీ నేతలనే రేవంత్ టార్గెట్ చేయడం కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో రేవంత్ వ్యవహారాన్ని ఇలాగే వదిలిపెడితే పార్టీకి డ్యామేజ్ తప్పదన్న ఆలోచనలో ఉన్నారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశాలతో పార్టీ గ్రాఫ్ పెరిగిపోయిందని.. ఇలాంటి తరుణంలో రేవంత్ అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లి ఉత్తమ్ కుమార్‌పై నెగటివ్ కామెంట్స్ చేయడంతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు.

ఇక యురేనియం తవ్వకాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్ చేసిన వ్యాఖ్యలను కోదండరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించామని తెలిపారు. అలాగే యురేనియం అంశంపై జనసేన నేత్రుత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు.

కాగా,హుజూర్‌నగర్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేలా చేశాయి.టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎవరితో చర్చించుకుండానే అభ్యర్థిని ఖరారు చేశాడని.. తాను మాత్రం చామల కిరణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నానని రేవంత్ ప్రకటించారు. దీంతో సొంత పార్టీలోనే కుమ్ములాటలు సాగుతున్నాయన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందని భావించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి.. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలకు సిద్దమయ్యారు. రేవంత్‌‌కు ఝలక్ ఇస్తే తప్ప మరోసారి ఇలాంటివి పునరావృతం చేయడని భావిస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading