ఏపీలో మూడు రాజధానులపై కేంద్రం రియాక్షన్ అప్పుడే...

ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందనే విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు

news18-telugu
Updated: January 21, 2020, 11:15 AM IST
ఏపీలో మూడు రాజధానులపై కేంద్రం రియాక్షన్ అప్పుడే...
అమరావతి-విశాఖపట్టణం
  • Share this:
ఏపీలో మూడు రాజధానులపై కేంద్రం నిర్ణయం ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిది అని కొందరంటే... దీనిపై కేంద్రం అనుమతి తప్పనిసరి అని మరికొందరు చెబుతున్నారు. దీనిపై కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో ఇప్పటికే ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం... మండలిలోనూ ఈ బిల్లును గట్టెక్కించేలా వ్యూహరచన చేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ ఏకపక్షంగా తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే రాజధాని మార్పునకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుందని కన్నా కామెంట్ చేశారు.

పునర్విభజన చట్టం అమలుకు హోం శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉందని.. అందుచేత మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న కన్నా మాటలను బట్టి... ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ ఓ వైఖరి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం తీసుకునే నిర్ణయమే బీజేపీ నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ అంశం కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్లినప్పుడే... దీనిపై కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు