• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CENTRE STRESS FOR AP CM YS JAGAN AND TELANGANA CM KCRS MEET ON WATER DISPUTE BA

కేసీఆర్, జగన్ భేటీ... త్వరలోనే ముహూర్తం...

కేసీఆర్, జగన్ భేటీ... త్వరలోనే ముహూర్తం...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉంది.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంపై వారిద్దరూ కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇద్దరినీ ఒక టేబుల్ వద్దకు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సభ్యులే. జనవరిలో జరిగిన ఓ సమావేశంలో రెండు రాష్ట్రాలు ఓ తేదీని అనుకుని ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాలని భావించాయి. అప్పుడు చెప్పినట్టుగా రెండు రాష్ట్రాలు త్వరగా తమ అజెండాను పంపాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్రం కూడాభావిస్తోంది. ఇప్పటికే ఎన్జీటీ ఆదేశాలతో శ్రీశైలంలో జల విద్యుత్‌‌ను కూడా ఆంధ్రప్రదేశ్ నిలిపివేసింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు