వారి మెడల్స్ వాపస్ తీసుకునే ప్లాన్‌లో కేంద్రం

CBI Vs Mamata | ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 7, 2019, 5:30 PM IST
వారి మెడల్స్ వాపస్ తీసుకునే ప్లాన్‌లో కేంద్రం
CBI Vs Mamata | ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ధర్నాలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించినట్టు తెలుస్తోంది.
  • Share this:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధంలో పోలీసులు నలిగిపోతున్నారు. తాజాగా శారదా స్కాంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐని రాష్ట్ర పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద రచ్చ అయింది. సీబీఐ, కేంద్రం తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో పోలీసు అధికారులు కూడా ఉండడం కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది.

mamata banerjee, mamata banerjee news, mamata banerjee dharna, chief minister mamata banerjee, mamata banerjee live, mamata banerjee speech, mamta banerjee latest, mamta banerjee cbi, mamta banerjee dharna against cbi raid, mamata banerjee sit on strike against cbi raid, మమతా బెనర్జీ, సీబీఐ
కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా, పక్కన పోలీసులు (Image : ANI / Twitter)


మమతా బెనర్జీ చేపట్టిన ధర్నా (లేదా నిరసన)లో పాల్గొన్న పోలీసు అధికారుల నుంచి మెడల్స్ వాపస్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఆయా అధికారులను సెంట్రల్ డిప్యుటేషన్ మీద కూడా తీసుకోకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. సెంట్రల్ గవర్న‌మెంట్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఓ రాజకీయ పార్టీ చేపట్టే ధర్నాలో యూనిఫాం సర్వీసుల్లో ఉండే వారు పాల్గొనకూడదు.

Mamata Banerjee, Rajeev Kumar, Kolkata Police, Left Front, Trinamool Congress, mamata vs cbi, mamata banerjee cbi, mamata banerjee news, mamata banerjee dharna, mamata banerjee vs cbi, cbi vs mamata banerjee, cbi vs kolkata police, mamata banerjee speech, mamata banerjee live, mamata banerjee on dharna, mamata banerjee latest news, mamta banerjee latest, mamata banerjee protest, మమతా బెనర్జీ
మమతా బెనర్జీ, రాజీవ్ కుమార్ (File)


మమతా బెనర్జీ ధర్నా, రాష్ట్రంలో శాంతిభద్రతకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఇచ్చిన నివేదికను బట్టి కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు ఐపీఎస్ అధికారులు మమతా బెనర్జీతో పాటు ధర్నాలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి.

వీరేంద్ర (1985 బ్యాచ్) పశ్చిమ బెంగాల్ డీజీపీ
వినీత్ కుమార్ గోయల్ (1994 బ్యాచ్) ఏడీజీ, డైరెక్టర్, సెక్యూరిటీఅనుజ్ శర్మ (1991 బ్యాచ్) ఏడీజీ, శాంతిభద్రతలు
గ్యాన్వంత్ సింగ్ (1993 బ్యాచ్), బీదానగర్ సీపీ
సుప్రతిమ్ సర్కార్ (1997 బ్యాచ్), కమిషనర్

వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం.
First published: February 7, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading