మండలి రద్దుపై జగన్ స్పీడ్‌కు కారణం ఇదేనా..?

సాధ్యమైనంత తొందరగా ఏపీ శాసనమండలికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

news18-telugu
Updated: January 27, 2020, 7:59 PM IST
మండలి రద్దుపై జగన్ స్పీడ్‌కు కారణం ఇదేనా..?
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ తాను చెప్పినట్టుగానే శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ విషయంలో కేంద్రం ఏం చేయబోతోందనే అంశంపైనే నెలకొంది. శాసనమండలి రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... దీనిపై కేంద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవడానికి రెండేళ్ల సమయం పడుతుందని టీడీపీ నాయకత్వం ధీమాగా ఉంది. అప్పటివరకు శాసనమండలిలో తమ ఎమ్మెల్సీల్లో చాలామంది పదవీ విరమణ చేస్తారనే భావనలో టీడీపీ ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీలకు చంద్రబాబు చెప్పారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ విషయంలో జగన్ లెక్క మాత్రం వేరుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఏపీ శాసనమండలికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే నమ్మకంతో ఉన్న ఏపీ సీఎం జగన్... అన్నీ అనుకున్నట్టు జరిగితే రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఇంత హఠాత్తుగా ఈ శాసనమండలికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వెనుక అసలు కారణంగా కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వానికి స్పష్టమైన హామీ లభించి ఉండొచ్చని... అందుకే మండలి రద్దుపై వైసీపీ సర్కార్ శరవేగంగా ముందుకు సాగిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏపీ శాసనమండలి రద్దు విషయంలో సీఎం జగన్ తరహాలోనే కేంద్రం కూడా వేగంగా ముందుకు సాగుతుందా ? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Published by: Kishore Akkaladevi
First published: January 27, 2020, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading