దేశంలో ఎన్నికల ఖర్చు ఏ రేంజ్‌లో ఉందో తెలుసా.. ప్రపంచ దేశాలన్నీ బలాదూర్..

India's election is among the world's most expensive : 1998లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఖర్చు రూ.9వేల కోట్లు కాగా.. ఇప్పుడు రూ.55వేల కోట్ల నుంచి రూ.66వేల కోట్లకు చేరింది. ఇందులో అధికార పార్టీలు చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: June 18, 2019, 8:35 AM IST
దేశంలో ఎన్నికల ఖర్చు ఏ రేంజ్‌లో ఉందో తెలుసా.. ప్రపంచ దేశాలన్నీ బలాదూర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈసారి సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు కలిసి ఎంత ఖర్చు పెట్టాయో తెలుసా..అక్షరాలా యాభై వేల కోట్ల రూపాయలు. ఇదేదో నోటికి చెబుతున్న లెక్క కాదు.. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్‌) వెల్లడించిన లెక్క. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ఖర్చు రెట్టింపు అయినట్టు తెలిపింది. అంతేకాదు, ప్రపంచంలో మరే దేశంలోనూ ఎన్నికల ఖర్చు ఈ స్థాయిలో లేదని వెల్లడించడం గమనార్హం.సెంటర్ ఫర్ మీడియా స్టడీస్  ప్రతినిధి భాస్కర్ రావు, ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీరావు సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడైందని సీఎంఎస్ తెలిపింది.తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కలిపి మొత్తం రూ.5450కోట్లు ఖర్చయినట్టు వెల్లడించింది.అదే ఏపీలో ఎన్నికల ఖర్చు రూ.10వేల కోట్లు దాటిందని తెలిపింది. దేశంలోని నియోజకవర్గాలన్నింటిలో అత్యంత ఎక్కువ ధనప్రవాహం జరిగిన నియోజకవర్గాల జాబితాను కూడా సీఎంఎస్ వెల్లడించింది.అందులో మొత్తం 40 నియోజకవర్గాలు ఉండగా..  తెలుగు రాష్ట్రాల నుంచి కడప,అనంతపురం,విశాఖపట్నం,విజయవాడ,నల్గొండ,గుంటూరు,చేవెళ్ల,మల్కాజ్‌గిరి ఉన్నాయి. ఏపీలో సగటున ఒక్కో ఓటుకు రూ.2వేల వరకు పార్టీలు ఖర్చు చేసినట్టు తెలిపింది. గుడివాడ నియోజకవర్గంలో ఓటుకు రూ.2వేలు చొప్పున పంపిణీ చేస్తే..మరో ప్రాంతంలో రూ.7వేలు వరకు పంపిణీ చేసినట్టు సీఎంఎస్ పేర్కొంది.

1998లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఖర్చు రూ.9వేల కోట్లు కాగా..ఇప్పుడు రూ.55వేల కోట్ల నుంచి రూ.66వేల కోట్లకు చేరింది. ఇందులో అధికార పార్టీలు చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి. 1998లో 20శాతం ఎన్నికల ఖర్చు చేసిన బీజేపీ.. ఇప్పుడు 45శాతం
చేసింది. అటు కాంగ్రెస్ పార్టీ 2009లో మొత్తం ఎన్నికల వ్యయంలో 40శాతం ఖర్చు చేయగా తాజా ఎన్నికల్లో అది 20శాతానికి పడిపోయింది.
Published by: Srinivas Mittapalli
First published: June 18, 2019, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading