• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CENTRE BRAKES FOR CM YS JAGAN ON THREE CAPITAL PROPOSAL IN ANDHRA PRADESH AK

వైసీపీ సర్కార్ దూకుడుకు కేంద్రం బ్రేక్... అసలేం జరుగుతోంది ?

వైసీపీ సర్కార్ దూకుడుకు కేంద్రం బ్రేక్... అసలేం జరుగుతోంది ?

జగన్, అమిత్ షా మోదీ

ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చేందుకు తాము అంగీకరించబోమని కొందరు బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండటంతో... కేంద్రం కూడా అదే రకంగా ఆలోచిస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Share this:
    ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ భేటీని... రేపు జరపాలని భావించిన జగన్ సర్కార్... ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అయితే హఠాత్తుగా రేపటి కేబినెట్ భేటీ వాయిదా వేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. సోమవారం రోజునే ఈ భేటీ ఉంటుందని సర్కార్ వెల్లడించింది. అయితే అసలు ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడటానికి కారణమేంటనే దానిపై అసక్తికరమైన చర్చ జరుగుతోంది. కీలకమైన రాజధాని తరలింపు అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని కలిసి వివరించాలని ఏపీ సీఎం జగన్ భావించారనే చర్చ సాగుతోంది.

    అయితే ఏపీ సీఎం జగన్‌కు ఇంకా వారిద్దరి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని... ఈ కారణంగానే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తోందని సమాచారం. రాబోయే రెండు రోజుల్లో ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి వారికి రాజధాని తరలింపు అంశంపై వివరణ ఇవ్వాలని భావిస్తున్న సీఎం జగన్... ఆ తరువాతే దీనిపై కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ సీఎం జగన్‌కు ఇంకా లభించకపోవడంతో... మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చేందుకు తాము అంగీకరించబోమని కొందరు బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండటంతో... కేంద్రం కూడా అదే రకంగా ఆలోచిస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో వైసీపీ సర్కార్ వాదన మాత్రం మరోలా ఉంది. తాము అమరావతి నుంచి రాజధానిని తరలించడం లేదని... అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఉంటాయని చెబుతోంది. కాబట్టి మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి కూడా ఓ రాజధానిగా ఉంటుందని క్లారిటీ ఇస్తోంది. మొత్తానికి రాజధాని తరలింపు విషయంలో వైసీపీ సర్కార్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు