వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ రద్దు.. కేంద్రం నిర్ణయం

వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీ, రాయపాటి చారిటబుల్ ట్రస్ట్,ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి రిజిస్ట్రేషన్లను కూడా కేంద్రం రద్దు చేసింది.

news18-telugu
Updated: November 17, 2019, 7:28 PM IST
వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ రద్దు.. కేంద్రం నిర్ణయం
జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా విజయమ్మ భావోద్వేగం (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న ‘వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌’ను కేంద్రం రద్దు చేసింది. ‘విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010’లోని సెక్షన్ 14 కింద వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఒక్క విజయమ్మకు చెందిన చారిటబుల్ ట్రస్ట్‌నే కాదు.. తెలంగాణలో 90, ఏపీలో 168 ఎన్జీఓలను కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో కొన్ని చర్చిలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు చేశారనే అంశంపై వార్షిక నివేదికలను కేంద్రానికి సమర్పించడంలో విఫలమైనందుకు ఆయా ఎన్జీవోల మీద చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. FCRA చట్టం ప్రకారం విదేశీ విరాళాల విషయంలో ప్రతి ఏటా తప్పనిసరిగా ఆయా ఎన్జీవోలు నివేదికలు సమర్పించాలి.

‘FCRA చట్టం ప్రకారం వార్షిక నివేదికలను సమర్పించాలి. కానీ, 2017-18 సంవత్సరానికి నివేదికలు సమర్పించడంలో విఫలమయ్యాయి. రిపోర్టు సమర్పించడానికి 2019, మార్చి 31 వరకు గడువు పొడిగించినా కూడా వారు వార్షిక నివేదికను సమర్పించలేదు. వార్షిక నివేదికలు సమర్పించకపోవడం చట్ట విరుద్ధం. అయినా, చివరిగా ఓసారి అవకాశం కల్పించడానికి జూన్ 22న నోటీసులు ఇచ్చాం. 15 రోజుల్లో ఆదాయ వ్యవ నివేదికలు సమర్పించాలని కోరాం. కానీ వారు దాన్ని కూడా వినియోగించుకోలేకపోయారు.’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది.

వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీ, రాయపాటి చారిటబుల్ ట్రస్ట్,ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి రిజిస్ట్రేషన్లను కూడా కేంద్రం రద్దు చేసింది.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు