జగన్,చంద్రబాబు,కేసీఆర్‌కు కేంద్రం లేఖ... తప్పకుండా రావాలని పిలుపు

ఈ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు.

news18-telugu
Updated: June 16, 2019, 2:48 PM IST
జగన్,చంద్రబాబు,కేసీఆర్‌కు కేంద్రం లేఖ... తప్పకుండా రావాలని పిలుపు
జగన్ కేసీఆర్ చంద్రబాబు
news18-telugu
Updated: June 16, 2019, 2:48 PM IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ... ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రం లేఖ రాసింది. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా పార్టీల అధ్యక్షులకు ప్రత్యేకంగా లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి లేఖ అందింది.

ఈ నెల 19న కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానంగా 5 లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి... అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ 5 ప్రధాన అంశాలపైనే ముఖ్యంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలంటూ పార్టీల అధినేతలను కేంద్రం తమ లేఖలో కోరింది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...