'పోలవరం'లో ఏం జరుగుతోంది..? సీన్‌లోకి కేంద్ర ప్రభుత్వం..

Polavaram Reverse Tendering : నిజానికి రివర్స్ టెండరింగ్‌పై పీపీఏ అభ్యంతరం తెలిపినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అంచనా వ్యయం పెరిగిందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ చేపట్టింది.

news18-telugu
Updated: August 20, 2019, 8:13 AM IST
'పోలవరం'లో ఏం జరుగుతోంది..? సీన్‌లోకి కేంద్ర ప్రభుత్వం..
ఏపీ సీఎం జగన్(File)
  • Share this:
పోలవరం రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుపై కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంపై ఆరా తీస్తోంది. రివర్స్ టెండరింగ్ వివరాలు.. పాత టెండర్ల రద్దుకు సంబంధించి సమగ్ర నివేదికను త్వరలోనే అందజేయాలని పోలవరం అథారిటీని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఎలాంటి చర్యలకు దిగుతుందోనన్న చర్చ జరుగుతోంది.

నిజానికి రివర్స్ టెండరింగ్‌పై పీపీఏ అభ్యంతరం తెలిపినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అంచనా వ్యయం పెరిగిందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ప్రజాధనం ఆదా చేయడమే రివర్స్ టెండరింగ్ ఉద్దేశం అని చెప్పింది. ఈ మేరకు మొత్తం రూ.4,987.5 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలను పీపీఏ కేంద్రానికి పంపించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అవసరం ఏమొచ్చిందని కేంద్రం ఆరా తీస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి లెక్కలు తెలపాల్సిందిగా పీపీఏని అడిగింది. పీపీఏ నివేదిక అందిన తర్వాత కేంద్రం పోలవరంపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ప్రభుత్వంలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కేంద్రం గనుక జగన్ నిర్ణయానికి ప్రతికూలంగా స్పందిస్తే ప్రభుత్వానికి అది పెద్ద దెబ్బే అని చెప్పాలి.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>