Andhra Pradesh: తిరుపతికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. రైల్వేస్టేషన్ అభివృద్ధి, మరిన్ని రైళ్ల పెంపు

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్

తిరుమల తిరుపతి భక్తులకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడంతో పాటు, మరిన్ని రైళ్లను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి మాటలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లకోసమే కేంద్ర మంత్రి హామీలు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాయి.

  • Share this:
    కలియుగ వైకుంఠం తిరుమల భక్తులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుభవార్త చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్ ను సకల సౌకర్యాలతో.. అత్యాధునికంగా ఉండేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మరిన్ని రైళ్లను పెంచుతున్నామని కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా పియూష్ గోయల్ దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా తిరుమల భక్తులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న వాటికి ఆమోదం తెలుపుతామన్నారు.

    తిరుమల తిరుపతికి భారీగా వస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి  చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అలాగే మరిన్ని రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం రైళ్లను పునరుద్దరించామని.. అలాగే దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ప్రతీ చోట రైళ్లను నడుపుతున్నామని అన్నారు.

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అన్ని దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. 150 దేశాలకు మందులు సరఫరా చేయ్యగా.. ఇప్పటికే 75 దేశాలకు కోవిడ్ వాక్సిన్ ను పంపిణీ చేశామని గుర్తు చేశారు. అలాగే కరోనా ప్రభావం ఇంకా మన దేశంలో తగ్గలేదని. .వాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ సూచించారు. లేదంటే మళ్లీ కరోనా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు.

    అంతకుముందు శ్రీవారి సేవలో సతీ సమేతంగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్.  తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గోయల్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీరదించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బుగ్గన ఇతర ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.

    అయితే మరోవైపు కేంద్ర మంత్రి హామీలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపుతామని చేసిన పీయూష్ గోయల్ కామెంట్స్  ను ప్రతిపక్షాలు నమ్మడం లేదు.  బడ్జెట్ లోనే రూపాయి కూడా కేటాయించని కేంద్రం మాటలపై తమకు నమ్మకం లేదంటున్నారు. కేవలం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఓట్ల కోసం దేవుళ్ల దగ్గర రాజకీయం చేయడం బీజేపీ నేతలకు అలవాటే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  రాజకీయం  చేయడం తప్ప కేంద్రం ఏపీకి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  నిజంగా ఏపీ ప్రజలపై అంత అభిమానం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని పునరాలించుకుంటామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: