బీజేపీ వైపు చూస్తున్న చిరంజీవి నిర్మాత..?

ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్‌ బీజేపీ వైపు చూస్తున్నారా? టీడీపీని వదిలి కాషాయ కండువాను కప్పుకోవాలని నిర్ణయించుకున్నారా? తాజా పరిణామాలను గమనిస్తుంటే.. అవుననిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

news18-telugu
Updated: September 18, 2019, 3:57 PM IST
బీజేపీ వైపు చూస్తున్న చిరంజీవి నిర్మాత..?
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో నిర్మాత అశ్వినీదత్
  • Share this:
ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్‌ బీజేపీ వైపు చూస్తున్నారా? టీడీపీని వదిలి కాషాయ కండువాను కప్పుకోవాలని నిర్ణయించుకున్నారా? తాజా పరిణామాలను గమనిస్తుంటే.. అవుననిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ తరఫున 2004 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బరిలోకి దిగారు ఆయన. బాగానే ఖర్చు చేసినా.. వైఎస్ ఛరిష్మా ముందు అశ్వినీకి డిపాజిట్లు కూడా దక్కలేదని చాలా మంది అనుకున్నారు. అయితే, ఇప్పుడు.. బీజేపీలోకి మారే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. మంగళవారం ఆయన్ను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కలుసుకోవడమేనని చెబుతున్నారు. కేంద్ర మంత్రే స్వయంగా ఆయన కార్యాలయానికి వెళ్లి.. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అశ్వినీదత్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

ప్రహ్లాద్ జోషి, అశ్వినీదత్


ఈ సందర్భంగా మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంకదత్‌ను అభినందించిన ప్రహ్లాద్ జోషి.. మహానటి చిత్ర గొప్పతనాన్ని అడిగి తెలుసుకున్నారు. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు 20 నిమిషాల పాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు.

అనంతరం మాట్లాడిన అశ్వినీదత్.. ‘దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తుంది. మోదీ తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. దేశం కోసం మోదీ ఇలాంటి మరెన్నో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వారణాసిని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. కాశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించారు’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి త్వరలోనే బీజేపీలోకి వెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>