కేసీఆర్ కుక్కలకే గౌరవం... కేంద్రమంత్రి ఆగ్రహం

Telangana liberation day | తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు చేశారు.

news18-telugu
Updated: September 17, 2019, 11:07 AM IST
కేసీఆర్ కుక్కలకే గౌరవం... కేంద్రమంత్రి ఆగ్రహం
సీఎం కేసీఆర్ (Source: Twitter)
  • Share this:
తెలంగాణలో కేసీఆర్ ఇంటి పెంపుడు కుక్కలకు దక్కే విలువ కూడా అమరవీరులకు దక్కడం లేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యక్రమంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకు గుర్తింపు లేదని ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్ పెంపుడు కుక్కలు లేదా మజ్లిస్ పార్టీకి మాత్రమే గౌరవం ఉందని ధ్వజమెత్తారు. అమరవీరుల కారణంగానే ఇప్పుడు మన స్వేచ్ఛను అనుభవిస్తున్నామని... అలాంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ ప్రస్తుతం భారత్‌లో ఉందంటే అది సర్దార్ పటేల్ గొప్పతనమే అని ప్రహ్లాద్ జోషి అన్నారు. సర్దార్ పటేల్ హైదరాబాద్‌కు నిజాం నుంచి విముక్తి కలిగిస్తే... సెప్టెంబర్ 17న జన్మించిన ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్‌ను దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారని అన్నారు. నాడు సర్దార్ పటేల్ తరహాలోనే నేడు ప్రధాని మోదీ కూడా దేశ సమగ్రత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే రాజ్యాంగం అమలవుతోందని తెలిపారు.
First published: September 17, 2019, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading