• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CENTRAL MINISTER NITIN GADKARI SENSATIONAL COMMENTS CONGRESS CHIEF RAHUL GANDHI PRAISING GADKARI IN TWITTER PS

మళ్లీ వేసేసిన గడ్కరీ.. వాడేసుకుంటున్న రాహుల్

మళ్లీ వేసేసిన గడ్కరీ.. వాడేసుకుంటున్న రాహుల్

నితిన్ గడ్కరీ, రాహుల్ గాంధీ

  • Share this:
    రాజకీయాల్లో ఇప్పుడు ఏం మాట్లాడినా సంచలనమే. మాటల్లో విపరీతార్థాలు తీసి.. దానిపై రచ్చ చేయడం మామూలైపోయింది. అధికార పక్షం ఏమైనా అంటే ప్రతిపక్షం.. ప్రతిపక్షం ఏమైనా అంటే అధికార పక్షం.. ఇలా ఎవరికి దొరికినదాన్ని వాళ్లు తెగ వాడేసుకుంటున్నారు. తాజాగా నితిన్ గడ్కరీ చేసిన కామెంట్లను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.. తమ పార్టీకి అనుకూలంగా మలిచేసుకుని తెగ వాడేసుకుంటున్నారు.

    నితిన్ గడ్కరీ ఉద్దేశ్యం ఏమిటో తెలియదు గానీ.. ఇటీవల ఆయన చేస్తున్న సంచలన కామెంట్స్ బీజేపీని ఇరుకున పెట్టేస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ చేసీన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ’’ చాలామంది కార్యకర్తలు పార్టీ కోసం ఏదైనా చేస్తామని చెబుతుంటారు. ముందు వాళ్లంతా తమ కుటుంబాన్ని, పిల్లల్నీ పట్టించుకోవాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడుతారు?’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. కచ్చితంగా.. ఆయన మోదీని ఉద్దేశించే చేసి ఈ వ్యాఖ్యలు చేసిఉంటారనే ప్రచారం ఊపందుకుంది.

    central minister nitin gadkari, nitin gadkari sensational comments, congress chief rahul Gandhi, rahul Gandhi praising nitin gadkari, pm narendra modi, bjp chief amit shah, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నితిన్ గడ్కరీ సంచలన వ్యాక్యలు, నితిన్ గడ్కరిపై రాహుల్ గాంధీ ప్రశంసలు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
    నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ


    గడ్కరీ అన్నది మోదీని ఉద్దేశించేనా? అన్నది పక్కనబెడితే, ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలిచేసుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా గడ్కరీని ప్రశంసలతో ముంచెత్తారు. బీజేపీలో దమ్మున్న నాయకుడు ఆయనొక్కరే అంటూ గడ్కరీని ఆకాశానికి ఎత్తేశారు. ఇదే విధంగా, రాఫెల్ డీల్, రైతుల ఆత్మహత్యలు, వ్యవస్థల నిర్వీర్యం చేయడంపై మాట్లాడాలని కోరారు.



    ఇక, ముఖ్యమైన విషయం మరిచిపోయానంటూ.. మరో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. జాబ్స్ విషయంలో యువతను మోసం చేశారంటూ.. మోదీని నిలదీయాలని గడ్కరీని కోరారు.



    గతంలోనూ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలే చేసి కలకలం రేపారు. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయం సాధించినప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి పార్టీలో అందరూ సిద్ధంగా ఉంటారని, అపజయం ఎదురైనప్పుడు మాత్రం స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా మోదీ, అమిత్‌షాలను ఉద్దేశించే చేశారని గతంలో పెను దుమారమే రేగింది. అది చల్లారక ముందే ఇప్పుడీ వ్యాఖ్యలు మరింత కలకలం సృష్టిస్తున్నారు. ఇక, గడ్కరీ ఉద్దేశ్యం ఏమిటోగానీ, ఆయన వ్యాఖ్యల్ని మాత్రం కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీ మాత్రం బాగా వాడేసుకుంటున్నారనే గుసగుసలు రాజకీయవర్గాల్లో వినబడుతున్నాయి.

     
    First published: