Home /News /politics /

CENTRAL MINISTER NITIN GADKARI ANNOUNCED GOOD NEWS OVER ELECTRIC VEHICLES IN PARLIAMENT PAH

Nitin gadkari: ఎలక్ట్రిక్ వాహనాల ధరపై నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లలో.. వీటి ధరలు

నితిన్ గడ్కరీ(ఫైల్)

నితిన్ గడ్కరీ(ఫైల్)

Central minister good news: కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలకు తీపి కబురు అందించారు. పార్లమెంట్ సమావేశాలలో ఆయన.. ఎలక్ట్రిక్ వాహానాలపై కీలక ప్రకటన చేశారు.

nitin gadkari good news over electric vehicles: దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు రోజురోజుకి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు వాహానాన్ని బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రజలకు పెట్రో ధరలను తగ్గించాలని నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ సమావేశంలో కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది. ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహానాల ధర.. పెట్రోల్ ధరకు పడిపోతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, దీన్ని తగ్గించేందుకు .. ఎలక్ట్రిక్ వాహానాలను ప్రోత్సాహిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహానాలతో పర్యావరణానికి ముప్పు ఉండదని అన్నారు. దీన్ని ఉపయోగించడం వలన క్రమంగా కాలుష్యం తగ్గిపోతుందన్నారు.

వచ్చే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర నేడు పెట్రోల్ ధరతో సమానంగా ఉంటుందని సభ్యులందరికీ నేను హామీ ఇస్తున్నానని తెలిపారు. దీన్ని ఉపయోగించడానికి ఖర్చుకూడా తక్కువగానే ఉంటుందన్నారు. ప్రస్తుతం భారత్ వంటి అభివృద్ధి  చెందుతున్న దేశాలలో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే రెండేళ్లలో దీన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడతామని నితిన్ గడ్కరీ అన్నారు. దీంతో టూవీలర్ , త్రివీలర్ వాహానాల ధరలు తగ్గుతాయని అన్నారు. వీటి కోసం ప్రత్యేకంగా అన్ని చోట్ల చార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

అన్ని ప్రభుత్వ స్థలాల్లో ప్రత్యేకంగా చార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కాలుష్యం తగ్గించే దిశగా చర్యలు చేపడుతుందని అన్నారు. ఎల్పీజీ వాహానాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. నితిన్ గడ్కరీ హైడ్రోజన్ తో నడిచే వాహానంలో పార్లమెంట్ కు వచ్చారు. ఈ కారును జపాన్ కు చెందిన టయోటా కంపెనీ తయారు చేసింది. ఈ క్రమంలో హైడ్రోజన్ తో కాలుష్యం తగ్గుతుందని, ఇది భవిష్యత్ ఇంధనమని నితిన్ గడ్కరీ అన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Electric Vehicles, Nitin Gadkari, Parliament

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు