కేసీఆర్ తర్వాత సీఎం నేనే.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

‘తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం నేనే కావొచ్చు’.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివీ. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: January 20, 2020, 2:02 PM IST
కేసీఆర్ తర్వాత సీఎం నేనే.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
‘తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం నేనే కావొచ్చు’.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివీ. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి.. 2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ‘నేనే సీఎం కావచ్చు’ లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని.. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అటు.. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.

కాగా, సీఎం అభ్యర్థిపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. దీన్నిబట్టి 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపేందుకు సిద్ధమవుతోందని స్పష్టం అవుతోందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు