Home /News /politics /

CENTRAL HOME MINISTER AMIT SHAH TO VISIT ANDHRA PRADESH ON MARCH 4TH WILL HEAD SOUTHERN STATES DEVELOPMENT COUNCIL MEETING IN TIRUPATHI HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: త్వరలో ఏపీకి రానున్న అమిత్ షా.. కీలక సమావేశానికి రంగం సిద్ధం.. ఉత్కంఠకు చెక్ పెడతారా..?

అమిత్ షా (File)

అమిత్ షా (File)

Andhra Pradesh: సమావేశానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో పాటు తెలంగాణ (Telangana), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), తమిళనాడు (Tamilnadu), పుదుచ్చేరి (Pondicherry) రాష్ట్రాలు సభ్యలుగా పాల్గొనబోతున్నాయి.

    కేంద్ర మంత్రి అమిత్ షా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్థి సంబంధించిన కీలక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. మార్చి 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతి వేదికగా జరగనుంది. సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు సభ్యలుగా పాల్గొనబోతున్నాయి. అలాగే అండమాన్ నికోబార్, లక్షదీప్ లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననన్నాయి. ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టనెంట్ గవర్నర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు, ఇతర ముఖ్య అధికారులు ఈసదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సుమారు 90 నుండి 100 మంది వరకూ ప్ర‌ముఖులు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.

    ఈ సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వనున్న నేపధ్యంలో సమావేశం నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా అతిధులకు ఆహ్వానం, రవాణా, వసతి, బందోబస్తు వంటి ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో సదరన్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశానికి హాజరుకానున్న అతిధులందరికీ తగిన వసతి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రొటోకాల్ విభాగం అధికారులు, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పి, తిరుపతి మున్సిపల్ కమిషనర్, తిరుపతి అర్బన్ ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.

    ఇది చదవండి: వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్... లెక్కసరిచేస్తామన్న ఎమ్మెల్యే



    అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనానికి వచ్చే అతిధులకు తగిన దర్శన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అదేవిధంగా సదరన్ కౌన్సిల్ సమావేశం జరిగే ప్రధాన వేదిక హాల్లో ప్రత్యేక బ్యాక్ డ్రాప్ ఏర్పాటు, ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక ప్లెక్సీ బ్యానర్లు ఏర్పాట్లు, వేదిక సుందరీకరణ, నగర సుందరీకరణ వంటి చర్యల తీసుకోవాలని ప్రొటోకాల్, మున్సిపల్ తదితర శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.

    ఇది చదవండి: నిన్న జనసేన..నేడు ఏపీ బీజేపీ..విశాఖ స్టీల్ పై కేంద్రం మనసు మార్చుకుంటుందా..?



    రాజకీయాలు చర్చిస్తారా..?
    అమిత్ షా తిరుపతి రానున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో పాటు తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఈ రెండు ఎన్నికలపైనా అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా టూర్ తో తిరుపతి లోక్ సభ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశముందని భావిస్తోంది. మరోవైపు అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటంతో పార్టీ పరిస్థితులు, రాష్ట్ర సమస్యలపై చర్చించి స్పష్టమైన హామీ తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Amit Shah, Andhra Pradesh, Andhra pradesh news, Ap government, AP News, Central Government, Telugu news, Tirumala tirupati devasthanam, Tirupati, Tirupati Loksabha by-poll, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు