కేసీఆర్ మీరు నిజంగా సూపర్.. పొగిడేసిన అమిత్ షా..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ పట్ల కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. ఏకంగా కేంద్ర హోం మంత్రి, ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో పెద్ద నేత అమిత్ షానే స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు.

news18-telugu
Updated: March 23, 2020, 6:22 AM IST
కేసీఆర్ మీరు నిజంగా సూపర్.. పొగిడేసిన అమిత్ షా..
ఆర్టీసీ సమ్మె... రంగంలోకి కేంద్రం... కేసీఆర్‌కి షాకేనా?
  • Share this:
Janata Curfew Corona Effect : ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సేవకు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం ప్రకటించాలని కూడా కోరారు.. కానీ, చప్పట్లేంటని సోషల్ మీడియాలో కొందరు ఎగతాళి చేశారు. అప్పటిదాకా సీఏఏ, ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒక్కసారిగా కోపం వచ్చింది. మంచి పని చేయాలని కోరితే ఎద్దేవా చేస్తారా? అని మండిపడ్డారు. జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతూనే సోషల్ మీడియాలో ప్రధాని మోదీని కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. కర్ఫ్యూ సమయాన్ని పెంచేశారు కూడా. అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు కాలు గడప దాటనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎక్కడ చూసినా ఖాకీలే కనిపించేలా, ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటికి రాకుండా పకడ్చందీ చర్యలు తీసుకున్నారు. అంతేనా.. సాయంత్రం 5 గంటలకు కుటుంబంతో సహా ప్రగతి భవన్ బయటికి వచ్చి చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. ఇలా.. తనేంటో మరోసారి నిరూపించుకున్నారు సీఎం కేసీఆర్. దీనిపై కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. ఏకంగా కేంద్ర హోం మంత్రి, ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో పెద్ద నేత అమిత్ షానే స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు. జనతా కర్ఫ్యూను విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన అమిత్ షా.. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగ కార్యాచరణను మెచ్చుకున్నారు. కర్ఫ్యూను విజయవంతం చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని ప్రశంసించారు.

First published: March 23, 2020, 6:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading