మావల్ల కాదు.. మేమూ భరించలేం.. ఆర్టీసీపై చేతులెత్తేసిన కేంద్రం

ఇప్పటికే ఉన్న అప్పులు,నష్టాలకు తోడు ఇంత భారాన్ని తాము మోయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు కేంద్రం కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది. ఆర్టీసీ నష్టాలను తాము కూడా భరించలేమని చేతులెత్తేసింది.

news18-telugu
Updated: November 27, 2019, 11:34 AM IST
మావల్ల కాదు.. మేమూ భరించలేం.. ఆర్టీసీపై చేతులెత్తేసిన కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ నిర్వహణకు నెలకు రూ.640కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న అప్పులు,నష్టాలకు తోడు ఇంత భారాన్ని తాము మోయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు కేంద్రం కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది. ఆర్టీసీ నష్టాలను తాము కూడా భరించలేమని చేతులెత్తేసింది. అది తమవల్ల కాదని తేల్చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సందర్భంలో ఆర్టీసీపై కేంద్రం వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాలను భరించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారని.. కానీ అది తమ వల్ల కాదని చెప్పామన్నారు.అయితే రెండు రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ అధికారులను ఢిల్లీకి పిలిపించి ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఎంపీలతో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధాని మోదీ అపాయింట్‌‌మెంట్ కోరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే,ఆర్టీసీలో 5100 ప్రైవేట్ బస్సుల రూట్ పర్మిట్లకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఆర్టీసీ సిబ్బంది సంఖ్యను తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. 50ఏళ్లు పైబడిన కార్మికులకు వీఆర్ఎస్ ఆఫర్ చేసే యోచనలో ఉంది. ఈ నెల 28,29 తేదీల్లో నిర్వహించే కేబినెట్ సమావేశాల్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
First published: November 27, 2019, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading