చట్టాలను మార్చబోతున్నాం.. షాద్‌ నగర్ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు మార్పులు చేయబోతున్నట్టు తెలిపారు. సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకోరాబోతున్నామని తెలిపారు.

news18-telugu
Updated: November 30, 2019, 3:44 PM IST
చట్టాలను మార్చబోతున్నాం.. షాద్‌ నగర్ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షాద్‌నగర్ హత్యాచార ఘటనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులు మొదలు సినీ రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని చాలామంది తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు మార్పులు చేయబోతున్నట్టు తెలిపారు. సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకోరాబోతున్నామని తెలిపారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని.. ఇకనుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని అన్నారు. ట్రయల్ కోర్టులో విధించిన తీర్పును మధ్యలో మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తున్నట్టు చెప్పారు.

అలాగే మహిళల రక్షణ కోసం శనివారం ఉదయం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఒక యాప్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.ప్రతీ ఆడబిడ్డ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సింగిల్ డిజిట్ ప్రెస్ ద్వారా క్షణాల్లో సమీపంలోని పోలీసులకు,కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లేలా..ఆ యాప్‌ను రూపొందించామన్నారు.ఈ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామన్నారు. తాజా ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>