Home /News /politics /

CENTRAL GOVT GAVE PERMISSION TO PURCHASE TO ADDITIONAL PADDY FROM TELANGANA VRY

Paddy Issue : ఖరీఫ్ ధాన్యం సమస్య క్లోజ్...అయినట్టేనా... అదనపు కొనుగోళ్లకు కేంద్రం అనుమతులు..

మహిళా రైతు

మహిళా రైతు

Paddy Issue : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా రాతపూర్వకంగా ధాన్యం కొనుగోలుతో అదనపు ధాన్యాం కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.

    ఖరీఫ్ పంట కొనుగోలు పై నెలకొన్న వివాదానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. రాష్ట్రంలోని ఖరీఫ్ సీజన్‌లో అదనంగా ఉన్న ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సంబంధిత శాఖాలకు సమాచారం ఇస్తూనే... ఆదేశాలు జారీ చేసింది.  కాగా రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చిన అనుమతులు కాకుండా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేస్తామంటూ తెలిపింది.   ఖరీఫ్ సీజన్‌లో ఇదివరకే 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి అనుమతులు జారీ చేసిన కేంద్రం తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం లభించినట్టైంది.

    అయితే రాష్ట్ర ప్రభుత్వం అదనపు ధాన్యం కొనుగోలుతోపాటు రానున్న రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్‌ కొనుగోలుపై పట్టుపట్టింది.  దీంతో.. కేంద్రం కూడా పట్టుదలకు వెళ్లింది. రబీ సీజన్‌లో వచ్చే బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని  పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో ఇరు ప్రభుత్వాలతో పాటు రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. దీంతో ఒకరికి వ్యతిరేకంగా  ఒకరు ధర్నాలు ,రాస్తారోకోలు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రానున్న ఎండాకాలంలో వరిని పండించవద్దని రైతులకు విజ్ఝప్తి చేస్తూనే... ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేటుగా అమ్ముకోవాలనుకునే వారు ధాన్యం పంట వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

    Love marriage : ఒకరిని కాదు ఇద్దరిని ప్రేమించాడు.. రెండవ ప్రియురాలు చేసిన పనికి షాక్ తిన్నాడు..

    అయితే... ఈ  సమస్య కొలిక్కి వచ్చిన తర్వాత ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుపై వివాదం చెలరేగింది. కేంద్రం ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెబుతున్నా... కేంద్రం వద్దకు మాత్రం చేరలేదు.. దీంతో ఇచ్చిన అనుమతుల మేరకు ధాన్యం సేకరించాలని, ఆ తర్వాతే అదనపు ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇస్తామని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... తెలంగాణ మంత్రులు మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. తమకు రాత పూర్వకంగా అదనపు ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు ఆరు రోజుల పాటు మకాం వేశారు. అయితే ఢిల్లీ నుండి మంత్రులు తిరిగి వచ్చిన నాలుగు రోజులకు కేంద్రం, రాష్ట్రం డిమాండ్ చేసినట్టుగా అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేస్తామని సమాచారం అందించింది.

    Accident :పోష్ బైక్, రాష్ డ్రైవింగ్... మద్యంతో.. ముగ్గురు యువకుల పరిస్థితి దారుణం...!

    సో కేంద్రం సమాచారంతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి వివాదం సమసిపోనుంది. అయితే ఇన్నాళ్లు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న తర్వాత సమస్య పరిష్కారం కావడం గమనార్హం.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: PADDY PROCUREMENT, Telangana

    తదుపరి వార్తలు