హైదరాబాద్ సీబీఐకి కొత్త బాస్... జగన్‌కు ఊరట దక్కేనా ?

ఏపీకి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

news18-telugu
Updated: January 19, 2020, 12:54 PM IST
హైదరాబాద్ సీబీఐకి కొత్త బాస్... జగన్‌కు ఊరట దక్కేనా ?
సీఎం జగన్
  • Share this:
తెలుగురాష్ట్రాలకు కొత్త సీబీఐ బాస్‌ను కేంద్రం నియమించింది. హైదరాబాద్  సీబీఐ జేడీగా గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక నుంచి శశిధర్... జగన్ ఆస్తుల కేసులను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనకు అనుకూలమైన వారిని జేడీగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అమిత్ షాకు గతంలో విజయసాయిరెడ్డి లేఖ రాశారు. లక్ష్మీనారాయణ సూచించిన వ్యక్తిని కాకుండా గుజరాత్ క్యాడర్ అధికారిని నియమిస్తున్నట్లు రెండ్రోజుల క్రితం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ విషయంలో జగన్‌కు ఊరట లభించినట్లేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఇటీవలే.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయ మాట్లాడుతూ... జగన్ కేసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ త్వరలోనే జైలు పాలు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ కేసుపై సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం వారు చెబుతుంటారని, చట్ట ప్రకారం జరగాల్సింది జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కేసులో విచారణ జరగటం, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో సమర్పించడం.. వాటి ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుని శిక్ష విధించడటమా? లేక మరేదైననా అని తెలుస్తుందని వివరించారు. జగన్ కేసు విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. తాను విచారణ చేసేప్పుడు దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించానని వెల్లడించారు.

అయితే ప్రతీ శుక్రవారం అక్రమాస్తుల కేసులో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి వస్తుంది. అయితే సీఎం స్థాయిలో ఉన్నతనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతూ వచ్చారు. అయినా కోర్టు మాత్రం ఈ విషయంలో జగన్‌కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ప్రతీ శుక్రవారం విధిగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే కొత్తగా సీబీఐ జేడీగా వచ్చిన మనోజ్ శశిధర్‌తో జగన్‌కు కాస్త ఊరట లభించిందని తెలుస్తోంది.అయితే ఏపీకి ప్రత్యేకంగా సీబీఐ విభాగం ఉండదు. హైదరాబాద్ సీబీఐ యూనిటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల కేసులను డీల్ చేస్తుంది. త్వరలో అమరావతిలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రభుత్వం కొత్త జేడీకే అప్పచెప్పబోతున్నట్లు సమాచారం.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు