తీరని సీఎం జగన్ కోరికలు.. అసలేం జరుగుతోంది..?

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకునేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఆయన కోరికలు ఇంకా నెరవేరలేదు.

news18-telugu
Updated: April 27, 2020, 2:45 PM IST
తీరని సీఎం జగన్ కోరికలు.. అసలేం జరుగుతోంది..?
సీఎం జగన్
  • Share this:
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకునేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఆయన కోరిక ఇంకా నెరవేరలేదు. అదే సమయంలో ఎవరినైతే జగన్ పక్కనబెట్టేయాలనుకున్నారో వారికి మాత్రం కేంద్రం అవకాశాలు కల్పిస్తోందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకెళితే.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి చాలా కాలంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తనను ఏపీకి పంపించాలని కోరుతున్నారు. విజయసాయిరెడ్డి ద్వారా జగన్ ఆమె కోసం అమిత్ షాకు రాయబారాలు పంపిస్తున్నారు కూడా. అయితే, ఆమెకు క్లియరెన్స్ మాత్రం రాలేదు. అటు.. స్టీఫెన్ రవీంద్ర విషయంలోనూ అదే జరుగుతోంది. డిప్యుటేషన్ మీద ఆయన్ను ఏపీకి తెచ్చుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన విషయంలోనూ జగన్‌కు ఎదురుచూపులే ఎదురయ్యాయి. కర్నాటక కేడర్ అధికారి శ్రీవత్సను తెచ్చుకోవాలనుకున్నా వీలు కాలేదు. రోహిణి సింధూరి విషయంలో జగన్ ముందడుగే వేయలేదు. వీటి వెనక కారణాలపై రాజకీయ పండితులు తమకు తోచినవిధంగా చర్చించుకుంటున్నారు.

ఇక..జగన్‌కు తాజాగా ఓ రెండు షాకులు ఇచ్చింది కేంద్రం. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై ఏపీ సర్కారు కేసు పెట్టింది. ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లి పోకుండా జీవోలు వచ్చాయి. ఆయన క్యాట్‌కు వెళ్లడంతో జగన్ తీరును తప్పుపట్టింది. ఇప్పుడు కేంద్రం కృష్ణకిశోర్‌కు ఏకంగా పదోన్నతి ఇచ్చి మరీ ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చింది. టీటీడీ జేఈవోగా పనిచేసే శ్రీనివాసరాజు కూడా అర్జీ పెట్టుకోగానే తెలంగాణకు మూడేళ్ల డిప్యూటేషన్ ఇచ్చేసింది. అంతకుముందు.. ముగ్గురు సీఎంలు మారినా శ్రీనివాసరాజు టీటీడీ జేఈవోగానే కొనసాగారు. కానీ, జగన్ పదవి చేపట్టగానే ఆ పోస్టు నుంచి ఆయన్ను తొలగించారు. రాజు మాత్రం ఢిల్లీలో చక్రం తిప్పుకుని డిప్యూటేషన్ తెచ్చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా క్లీన్ చిట్ కోసం చూస్తున్నారు.

గతంలో సీబీఐ ఉన్నతాధికారులు కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ గొడవలో మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి కేంద్ర బిందువుగా మారి కోర్టుకు ఓ కీలక లేఖను సమర్పించారు. ఆ తర్వాత సుప్రీం ఉత్తర్వులతో అమిత్ షా తనకు అత్యంత సన్నిహితుడైన ఆస్తానాను పక్కన పెట్టాల్సి వచ్చిందట. దానికి కారణమైన మనీశ్ కుమార్ సిన్హాకు సీఎం జగన్ ఏకంగా ఇంటలిజెన్స్ చీఫ్ పదవినిచ్చారు. దీంతో.. అమిత్ షా హర్ట్ అయ్యారని, ఆ ఎఫెక్ట్ జగన్ మీద పడుతోందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 27, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading