ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. నూతన సంవత్సర కానుకగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: December 31, 2018, 8:15 PM IST
ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. నూతన సంవత్సర కానుకగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశమంతా ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రజలకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. సబ్సిడీ సిలిండర్ ధరపై రూ. 5.90 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 120 తగ్గించింది. ఈ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి. కేంద్ర నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే కొన్నాళ్ల నుంచి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వందకు చేరువైన లీటర్ ఫ్యూయల్ రేట్లు..

మళ్లీ 60ల్లోకి రావడంతో ప్రజలకు ఊరట లభించింది. ఇక, తాజాగా కేంద్రం న్యూ ఇయర్ కానుకగా ప్రజలకు తీపి కబురును అందించింది. వంటగ్యాస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
First published: December 31, 2018, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading