NRC అమలుపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన

NRC అమలుపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన

లోక్‌సభలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో దేశ వ్యాప్తంగా పలు మైనార్టీ వర్గాలకు ఊరట లభించనట్లైంది.

  • Share this:
    ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా లోక్‌‌సభలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీపై కీలక ప్రకటన చేసింది. NRC అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. లోక్‌సభలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో దేశ వ్యాప్తంగా పలు మైనార్టీ వర్గాలకు ఊరట లభించనట్లైంది. తాజాగా ఇవాళ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి గురించి కేంద్రం చర్చించలేదని పలు సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ఉన్నతాధికారులు చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత ఉన్నప్పటికీ, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ‌కు చెందిన ఓ బిజెపి నేత ఈ సంవత్సరం ప్రారంభంలో, సిఎఎ అమలు చేసిన తరువాత, NRCకూడా అమలు అవుతుందని బుక్‌లెట్ ఒకటి విడుదల చేశారు. దీంతో బెంగాల్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా ప్రతీ రాష్ట్రం ప్రతి జిల్లాలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: