ఏపీలో తెలంగాణ ఉద్యోగులకు... కేంద్రం శుభవార్త

ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోెంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: October 12, 2019, 8:58 AM IST
ఏపీలో తెలంగాణ ఉద్యోగులకు... కేంద్రం శుభవార్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానికత కోటా మరో రెండేళ్లు పొడిగించినట్లు పేర్కొంది. తెలంగాణ నుంచి ఏపీ కి వచ్చే వారికి 2021 జూన్ 2 వరకూ స్థానికత పెంచింది. దీంతో విద్యా ఉద్యోగాల్లో మరో రెండేళ్లవరకూ స్థానికత పొందే అవకాశం ఉంది.కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో జారీ చేయనుంది.

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోెంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిక ప్రకారం నవ్యాంధ్ర ఏర్పడిన 2004 జూన్ 2 నుంచి ఏడేళ్లలోపు తలెంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి వీలుంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయిన తర్వాతా ఇప్పటికీ వివిధ పోలీసు కేడర్‌తో పాటు, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశం కొలిక్కి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది హైదారబాద్‌తో పాటు తెలంగాణలో ఉంటున్నారు.

ఈ సమస్య పరిష్కారానికి ఇంకా సయమం పట్టే అవకాశం ఉన్నందున చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 2తో ముగిసిన గడువును మరో రెండేళ్ల పాటు పెంచాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో దాన్ని 2019 జూన్ వరకు పొడిగించారు. ఇప్పుడు తాజాగా మరో రెండేళ్లు పెంచారు. దీని ప్రకారం 2021 జూన్ 2 లోపు తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చి ఏ ప్రాంతంలో స్జతిరపడితే ఆ స్థానికతను కల్పించే విద్యా, ఉద్యోగవాకాశాల్లో అందుకు తగ్గ ప్రాధాన్యం ఇస్తారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>