Home /News /politics /

Andhra Pradesh: జగన్ కు ఊహించని షాకిచ్చిన కేంద్రం... సంక్షేమ పథకాలకు నిధులు కష్టమేనా...?

Andhra Pradesh: జగన్ కు ఊహించని షాకిచ్చిన కేంద్రం... సంక్షేమ పథకాలకు నిధులు కష్టమేనా...?

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రస్తుతం అప్పులతో నడుస్తోంది. ప్రభుత్వ అప్పులు దాదాపు రూ.4లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు కేంద్రం ఊహించని షాకిచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. సంక్షేమ క్యాలెండర్ ద్వారా నెలకొక పథకం చొప్పున అమలు చేస్తోంది. ఐతే ఈ పథకాల అమలకు ఆదాయం కంటే అప్పులపైనే ఎక్కువ ఆధారపడుతోందన్న విమర్శలు కూడా లేకపోలేదు. అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని ఎండగట్టిన వైసీపీ... అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు అప్పులు చేస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వానికి షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రుణ పరిమితులపై ఆంక్షలు విధించింది. గత ఏడాది కరోనా కారణంగా కొన్ని షరతులతో పెంచిన రుణపరిమితిని ఈసారి కొనసాగించేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీఎం జగన్ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది.

    అప్పుల విషయంలో సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. ఈ అంశంలో ఎలాంటి పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.42,742 కోట్ల రుణం తెచ్చుకునేలా పరిమితిని పెంచాలని కేంద్రాన్ని జగన్ కోరగా.. ఇటీవల ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కూడా ఇదే విజ్ఞప్తిని ఆమె ముందుచారు. అయినా ఆర్ధిక శాఖ మాత్రం పరిమితిని పెంచేది లేదని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం కేంద్రం విధించిన నిబంధనలకు లోబడే అప్పులు చేయాల్సి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: ఆనందయ్య మందు ఇప్పట్లో లేనట్లే..? హైకోర్టులో ఏపీ ప్రభుత్వం సంచలన కామెంట్స్..


    2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 42,742 కోట్ల రుణాలు తెచ్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరగా.. మోదీ ప్రభుత్వం రూ.37,163 కోట్లకే తొలుత అనుమతిచ్చింది. ఆ తర్వాత దానిని రూ.32,669 కోట్లకు తగ్గించింది. ఇటీవల ఆ పరిమితిని కాస్తా... మరింత తగ్గించి రూ.27,669 కోట్లు మాత్రమే రుణాలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

    ఇది చదవండి: మరోవివాదంలో సీఎం జగన్... ఆస్తిపన్నుపై రగడ.. అసలు నిజం ఇదే..!


    సంక్షేమ పథకాల పేరుతో భారీగా అప్పులు చేస్తుండటం, తాము తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే రుణపరిమితుల్లో కేంద్రం కోత విధించినట్లు తెలుస్తోంది. బీజేపీ సర్కారును ఏపీలో విమర్శిస్తున్న వైసీపీ ప్రభుత్వం.., ఢిల్లీలో మాత్రం సఖ్యతగానే మెలుగుతోంది. అయినా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కనబెట్టడం, రుణపరిమితి పెంపుకు అంగీకరించకపోవడం గమనార్హం. మరి కేంద్రం విధించిన పరిమితికి లోబడి రుణసమీకరణ చేస్తే.. అవి సంక్షేమ పథకాలకు సరిపోతాయా..? లేకపోతే ఇతర మార్గాల్లో ప్రభుత్వం ఇతర మార్గాల్లో నిధులు సమకూర్చుకుంటుందా..? అనేది చర్చనీయాంశమవుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap welfare schemes, Central Government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు